బాబా నూడుల్స్ ..భయపడకుండా తినండి
టు మినిట్స్ టు నూడుల్స్ ఇదీ మ్యాగీ నూడుల్స్ ట్యాగ్‌లైన్. పిల్లల నుంచి పెద్దల వరకూ తన రుచికి బానిసలను చేసుకుని మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్ పరిమితికి మించిన లెడ్ ఉందన్న కారణంతో నిషేధానికి గురైంది. మ్యాగీపై నానా యాగీ జరిగింది. ఇదంతా ముగిసిన అధ్యాయం. అయితే మ్యాగీ నూడుల్స్ స్థానాన్ని ఆక్రమించేందుకు యోగాగురు రాందేవ్ బాబా రంగంలోకి దిగారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆప్తుడు, మొన్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా సాగించిన బాబా నూడుల్స్ […]
టు మినిట్స్ టు నూడుల్స్ ఇదీ మ్యాగీ నూడుల్స్ ట్యాగ్‌లైన్. పిల్లల నుంచి పెద్దల వరకూ తన రుచికి బానిసలను చేసుకుని మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్ పరిమితికి మించిన లెడ్ ఉందన్న కారణంతో నిషేధానికి గురైంది. మ్యాగీపై నానా యాగీ జరిగింది. ఇదంతా ముగిసిన అధ్యాయం. అయితే మ్యాగీ నూడుల్స్ స్థానాన్ని ఆక్రమించేందుకు యోగాగురు రాందేవ్ బాబా రంగంలోకి దిగారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆప్తుడు, మొన్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా సాగించిన బాబా నూడుల్స్ ..వస్తూనే అభయం ఇస్తున్నాయి.“ చిటికెలో వండండి.. భయపడకుండా తినండి “ అనేది బాబా రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తి అయిన కొత్త నూడుల్స్ ట్యాగ్‌లైన్. అయితే వేలకోట్ల టర్నోవర్..వందల కోట్లు ఆర్జించి పెడుతున్న నూడుల్స్ వ్యాపారంలోకి రాం దేవ్ బాబా కన్ను ఎప్పుడో పడిందని, అందులో భాగంగానే మ్యాగీని ఓ కంటకనిపెట్టి పని పట్టారనే విమర్శలున్నాయి. ఏదైతేనేం యోగా గురు నూడుల్స్ ఏన్‌డీఏ ప్రభుత్వం ఉన్నంతవరకూ భయపడకుండా తినొచ్చు. ఒక వేళ కేంద్రంలో యూపీఏ వస్తే మళ్లీ బాబాగారి నూడుల్స్‌లో ఏ సీసమో..! మోసమో..! తప్పకుండా బయటపడుతుంది.
బాబా నూడుల్ రూ.15
“చిటికెలో వండండి..భయపడకుండా తినండి“ అని అభయమిస్తూ మార్కెట్‌లోకి వస్తున్న రాందేవ్‌బాబాకు చెందిన పతంజలి గ్రూప్ తయారు చేస్తున్న నూడుల్స్ ఖరీదు కేవలం 15 రూపాయలేనట. మ్యాగీ నిషేధాన్ని సొమ్ము చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో పతంజలి గ్రూప్ రంగంలోకి దిగింది. ఆయుర్వేద ప్రచారం, స్వదేశీ లుక్‌తో ఇన్‌స్టంట్ నూడుల్స్ తయారుచేసి వేలకోట్లు కొల్లగొట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. ‘ఝట్ ఫట్ పకావో… ఔర్ బేఫికర్ ఖావో..’ (చిటికలో వండండి… భయపడకుండా తినండి) అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తున్న పతంజలి గ్రూప్ నూడుల్స్ ధరను రూ 15 గా నిర్ణయించారు. వచ్చేవారమే ఈ నూడుల్స్ మార్కెట్‌లోకి రానున్నాయని సమాచారం.
ఇందులో సీసం ఉండదట!
బాబాగారి నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూకోనేట్ అస్సలు ఉండదట. సీసం మోసాలకు తాము దూరం అని ప్రకటించేశారు. ఇతర కంపెనీల్లా మైదా కలిపిన గోధుమ పిండితోకాకుండా అచ్చమైన గోధుమ పిండితో నూడుల్స్ తయారు చేస్తామని చెబుతున్నారు. కేవలం రైస్ బ్రాన్ ఆయిల్‌ను ఉపయోగించి ఈ నూడుల్స్‌ను తయారుచేస్తామని, తమ ఉత్పత్తులను భారత ఆహార భద్రత, నాణ్యత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ) ఎలాంటి తనిఖీలైనా నిర్వహించుకోవచ్చని రామ్‌దేవ్ చెప్పారు. అక్టోబర్ 15న నూడుల్స్ లాంఛింగ్‌కు ముహూర్తం కూడా ఖరారు చేశారు.