అప్పు చేసి పప్పు కూడు... ఇదే బాబు పాలసీ
అమరావతి రాజధాని శంకుస్థాపనను చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. ఓ వైపు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు ఆర్థిక శాఖ అధికారులు మాత్రం నిధులు సమకూర్చలేక ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రస్తుతం సుమారు 90కోట్ల రూపాయల మేరకు ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్లిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ఆదాయం తగ్గుతుండగా.. మరోవైపు ఖర్చులు పెరుగుతున్నాయని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు తొలివారంలో […]
BY sarvi10 Oct 2015 10:34 PM IST
X
sarvi Updated On: 12 Oct 2015 5:36 AM IST
అమరావతి రాజధాని శంకుస్థాపనను చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. ఓ వైపు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు ఆర్థిక శాఖ అధికారులు మాత్రం నిధులు సమకూర్చలేక ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రస్తుతం సుమారు 90కోట్ల రూపాయల మేరకు ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్లిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ఆదాయం తగ్గుతుండగా.. మరోవైపు ఖర్చులు పెరుగుతున్నాయని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
అక్టోబరు తొలివారంలో 950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఖర్చు మాత్రం ఏకంగా 3370 కోట్లు దాటి పోయిరది. దీంతో 2వేల 400 కోట్ల లోటు ఏర్పడింది. ఇక పాత ఆదాయంతో కలుపుకొని కొరతను కాస్త పూడ్చినప్పటికీ ఇంకా 900 కోట్ల అప్పు ఉంది. ఇందులో 770 కోట్లు వేస్ అరడ్ మీన్స్‌లో ఉంది. అది కూడా దాటి పోవడంతో మరో 90 కోట్ల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పెరిగింది.
అధికారులు, మంత్రుల పర్యటనలకు కూడా ఖర్చు భారీగా పెరిగిపోతోందని ఇది ఖజానాపై భారంగా మారుతోందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు అత్యసవర బిల్లులు మినహా ఇతర చెల్లింపులను నిలిపివేయాలని ఆదేశించారు. మొత్తం మీద రాజధాని శంకుస్థాపన మీద ప్రభుత్వం చేస్తున్న అదనపు ఖర్చులు ఆర్థికశాఖ అధికారులకు మాత్రం ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం ఖర్చులను నియంత్రించకపోవడంతో రాష్ట్రం మరోసారి అప్పుల్లో కూరుకుపోతోంది.
శంకుస్థాపన ఖర్చుతో సరికొత్త రికార్డు
అమరావతిలో శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించక ముందే రికార్డుల దిశగా ప్రయాణిస్తోంది. ప్రపంచంలో ఏ ఒక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఖర్చు కానంత సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. అన్నీ కలుపుకుని అమరావతి శంకుస్థాపన ఆర్బాటాలకు, ఆహ్వానాలకు రూ.400 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఏకమొత్తంగా ఈ నిధులను విడుదల చేయకుండా… నేర్పుగా వివిధ శాఖల ఖాతాలకు విడుదల చేసి.. శంకుస్థాపనకే ఖర్చు చేస్తున్నారని సమాచారం. 21వ శతాబ్దపు ప్రజారాజధాని అమరావతి అంటూ ఊదరగొడుతున్న శంకుస్థాపన పండగకు వివిధ శాఖలు తమ సాధారణ నిధుల నుంచి వెచ్చిస్తున్నాయి. రోడ్లు భవనాలు, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, పర్యాటక, దేవాదాయ, ప్రణా ళిక, మౌలిక సౌక ర్యాలు, పెట్టుబడులు తదితర శాఖల ద్వారా కోట్ల నిధులను ఖర్చు చేస్తూ పనులు చేపట్టారు. తమ వద్ద ఉన్న నిధులను శంకుస్థాపన కోసం ఖర్చుచేసి… ఆ తరువాత ఆర్థికశాఖ నుంచి వాటిని తిరిగి పొందాల్సి ఉంటుంది. శాఖల వారీగా చూస్తే.. పది, ఇరవై, ముఫ్ఫయి కోట్లు లెక్క వస్తున్నా.. అన్నీ శాఖలు కలిపి శంకుస్థాపన సంబరాలకు చేస్తున్న ఖర్చును కలిపితే నాలుగు వందల కోట్లు దాటిపోతుందని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రోటోకాల్‌కు రూ. 25 కోట్లు
దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తున్నారు. అతిరథ మహారథులు వస్తున్న ఈ కార్యక్రమానికి ఒక్క ప్రోటోకాల్ ఖర్చే 25 కోట్లు దాటిపోనుందని సమాచారం. ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖకు ప్రోటో కాల్ నిర్వహణకు రూ.25కోట్లు కేటాయింపు జరిగిపోయింది. ఈ నిధుల నుంచే అతిథుల కోసం ఏర్పాటు చేసిన హెలి కాప్టర్లు, ప్రత్యేక విమానాలకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో ఖర్చు విపరీతంగా అయ్యే అవకాశం ఉండడంతో అదనపు నిధులు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఓ పండగ అని చెబుతున్న ఏపీ సర్కారు, ఈ పండగ నిర్వహణను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థ అందించే సేవలకు రూ.10 కోట్లు చెల్లించారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా అమరావతి శంకుస్థాపన పనిలో ఉండగా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కొత్తగా చేసేదేముంది అనే ప్రశ్న వస్తోంది.

Next Story