కొనసాగుతున్న బంద్ ... అరెస్ట్‌లు షురూ
తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులూ అరెస్ట్.. తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ, ఎంసీపీఐ… ఇలా బంద్ నిర్వహణకు అన్ని పక్షాలు ఒక్కటయ్యాయి. ఉదయమే బస్ డిపోల ఎదుట నాయకులంతా బైఠాయించడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు అరెస్టయ్యారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మరికొన్నిచోట్ల ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతల్లి ఫ్లైఒవర వద్ద, చిలకలగూడ […]
తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులూ అరెస్ట్..
తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ, ఎంసీపీఐ… ఇలా బంద్ నిర్వహణకు అన్ని పక్షాలు ఒక్కటయ్యాయి. ఉదయమే బస్ డిపోల ఎదుట నాయకులంతా బైఠాయించడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులు అరెస్టయ్యారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మరికొన్నిచోట్ల ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతల్లి ఫ్లైఒవర వద్ద, చిలకలగూడ ప్రాంతంలో నాలుగు బస్సులను ధ్వంసం చేశారు. అరెస్టులు కూడా వేగం పుంజుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మందిని అరెస్ట్ చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, సుధీర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ప్రకాష్‌గౌడ్, శ్రీశైలం గౌడ్, వివేకానంద, సాయన్న, చింతల రామచంద్రారెడ్డి, లక్ష్మణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొంగలేటి, ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, రాజయ్య, విజయరామారావు, సీతక్క, సీపీఐ కార్యదర్శి నారాయణ తదితరులు వివిధ డిపోల వద్ద ధర్నాలు చేస్తూ అరెస్టయ్యారు. జీడిమెట్ల, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, బీహెచ్‌ఈఎల్, ఎంజీబీఎస్, జేబీఎస్, రాజేంద్రనగర్ డిపోల వద్ద నాయకులు అడ్డంగా పడుకోవడంతో ఒక్క బస్సు కూడా రోడ్దు మీదకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సాయంతో బస్సులు నడపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రోడ్లపై కూడా కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
ఆదిలాబాద్ మొదలుకొని మొత్తం పది జిల్లాల్లో కూడా బంద్ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 588 బస్‌లు, వరంగల్, హన్మకొండ డిపోల్లో, కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ తదితర డిపోల్లో 800 బస్‌లు, మహబూబ్‌నగర్, నారాయణ్‌ఖేడ్ డిపోల్లో నాయకులంతా ధర్నాకు దిగడంతో బస్సులు బయటకు రాకుండా నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 670 బస్‌లు డిపోలు దాటి బయటకు రాలేదు. నిజామాబాద్‌లో 520 బస్‌లు, మెదక్, సంగారెడ్డి డిపోల్లో బస్సులు, ఖమ్మం, రంగారెడ్డి జిల్లా పరిగి డిపోల్లో బస్‌లు డిపోల్లో గేటు దాటి బయటకు రాలేదు. ప్రతిచోటా నాయకులంతా ధర్నాలకు దిగడం, డిపోలకు అడ్డంగా మోహరించడంతో బస్సులు కదలని పరిస్థితి వచ్చింది. జిల్లాల్లోను, నగరంలోను కూడా అనేకమంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రమే తాము నెరవేర్చమంటున్నామని, ఒకేసారి రైతు రుణ మాఫీ జరగాలని డిమాండు చేస్తున్నామని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని, వారికి తక్షణం పరిహారం చెల్లించాలని తాము కోరుతున్నామని వివిధ చోట్ల కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ, వామపక్షాల నాయకులు డిమాండు చేశారు. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంతవరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించక పోవడమే రైతుల పట్ల ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో తెలియజేస్తోందని టీడీపీ నాయకుడు ఎల్. రమణ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన రైతు సంక్షేమం గురించి ఆలోచించే చర్యలకు పూనుకోపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. తాము ప్రభుత్వం ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చమంటున్నామని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు.