నాకెందుకో ఆ రంగంటే ఇష్టముండదు...
తెలుగు-తమిళ-హిందీ భాషల్లో పాపులర్ అయిన శృతిహాసన్ తాజాగా తన స్టయిల్ స్టేట్ మెంట్ ఏంటో చెప్పుకొచ్చింది. బెంగళూరులో ఓ బ్రాండెడ్ షోరూం ను ప్రారంభించిన శృతి.. లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అవ్వడం తనకు అస్సలు ఇష్టముండదని చెబుతోంది. సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఇచ్చిన డ్రెస్ వేసుకోవడమే తప్ప, నిజజీవితంలో ట్రెండ్స్ ఫాలో అయిన దాఖలాలు లేవని చెబుతోంది. ఏది సౌకర్యంగా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటానని చెబుతోంది. అయితే చీరల కంటే జీన్స్ మాత్రమే తనకు […]
BY sarvi9 Oct 2015 12:35 AM IST
X
sarvi Updated On: 9 Oct 2015 3:59 AM IST
తెలుగు-తమిళ-హిందీ భాషల్లో పాపులర్ అయిన శృతిహాసన్ తాజాగా తన స్టయిల్ స్టేట్ మెంట్ ఏంటో చెప్పుకొచ్చింది. బెంగళూరులో ఓ బ్రాండెడ్ షోరూం ను ప్రారంభించిన శృతి.. లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అవ్వడం తనకు అస్సలు ఇష్టముండదని చెబుతోంది. సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఇచ్చిన డ్రెస్ వేసుకోవడమే తప్ప, నిజజీవితంలో ట్రెండ్స్ ఫాలో అయిన దాఖలాలు లేవని చెబుతోంది. ఏది సౌకర్యంగా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటానని చెబుతోంది. అయితే చీరల కంటే జీన్స్ మాత్రమే తనకు కంఫర్ట్ గా ఉంటాయని చెబుతోంది. ఇదే పంథాలో తనకు పసుపు రంగు అంటే అస్సలు పడదని ప్రకటించింది శృతిహాసన్. జీవితంలో ఇప్పటివరకు పసుపు రంగు ఉన్న డ్రెస్ ధరింలేదని చెబుతోంది. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత పసుపు రంగును పూర్తిగా పక్కనపెట్టేశానని అంటోంది. అదేంటని అడిగితే.. తనకు పసుపు రంగంటే ఫోబియా అని చెబుతోంది.
Next Story