సీఎం ప్రెస్‌మీట్‌లో మంత్రికి పదవి ఊడింది
అవినీతి, అన్యాయం, అరాచకం… దేన్ని ఉపేక్షించబోనని చెబుతూ వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ దీన్ని చేతల్లో కూడా చూపించారు. లంచం అడుగుతూ దొరికిపోయిన ఆరోగ్య, పర్యావరణశాఖ మంత్రి అసిమ్ అహ్మద్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఏకంగా మీడియా సమావేశంలోనే ప్రకటించేశారు. ఆయన స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్‌ను నియమిస్తున్నామని కూడా ప్రకటించారు. ప్రజలు తమను నిజాయితీపరులుగా నమ్ముతున్నారని, అందువల్ల అవినీతికి పాల్పడే వారినెవరినీ ఉపేక్షించబోమని కేజ్రివాల్ తెలిపారు. ఓ బిల్డర్‌తో కుమ్మక్కైనట్టు ఖాన్ మీద ఆరోపణలు వచ్చాయి. దీన్ని […]
అవినీతి, అన్యాయం, అరాచకం… దేన్ని ఉపేక్షించబోనని చెబుతూ వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ దీన్ని చేతల్లో కూడా చూపించారు. లంచం అడుగుతూ దొరికిపోయిన ఆరోగ్య, పర్యావరణశాఖ మంత్రి అసిమ్ అహ్మద్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఏకంగా మీడియా సమావేశంలోనే ప్రకటించేశారు. ఆయన స్థానంలో ఇమ్రాన్ హుస్సేన్‌ను నియమిస్తున్నామని కూడా ప్రకటించారు. ప్రజలు తమను నిజాయితీపరులుగా నమ్ముతున్నారని, అందువల్ల అవినీతికి పాల్పడే వారినెవరినీ ఉపేక్షించబోమని కేజ్రివాల్ తెలిపారు. ఓ బిల్డర్‌తో కుమ్మక్కైనట్టు ఖాన్ మీద ఆరోపణలు వచ్చాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం మంత్రిని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. గడచిన 8 నెలల్లో వివిధ ఆరోపణలతో కేజ్రివాల్ కేబినెట్ నుంచి ఆరుగురు సభ్యులు బయటికి రావాల్సి వచ్చింది.