బ్రూస్‌లీ తో కలిసి వస్తున్నశంకరాభరణం
ఈనెల 16న గ్రాండ్ గా విడుదలకాబోతోంది బ్రూస్ లీ సినిమా. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలున్నాయి. ఇలాంటి మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ ను క్యాష్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ట్రైచేస్తారు. రచయిత కోన వెంకట్ కూడా అదే చేశాడు. అన్నీ తానై తెరకెక్కిస్తున్న శంకరాభరణం సినిమా కోసం బ్రూస్ లీని వాడుకోవాలని చూస్తున్నాడు కోన వెంకట్. బ్రూస్ లీని ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఇంటర్వెల్ లో శంకరాభరణం సినిమా ట్రయిలర్ ను చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. […]
BY sarvi8 Oct 2015 12:35 AM IST

X
sarvi Updated On: 8 Oct 2015 5:53 AM IST
ఈనెల 16న గ్రాండ్ గా విడుదలకాబోతోంది బ్రూస్ లీ సినిమా. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలున్నాయి. ఇలాంటి మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్ట్ ను క్యాష్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ట్రైచేస్తారు. రచయిత కోన వెంకట్ కూడా అదే చేశాడు. అన్నీ తానై తెరకెక్కిస్తున్న శంకరాభరణం సినిమా కోసం బ్రూస్ లీని వాడుకోవాలని చూస్తున్నాడు కోన వెంకట్. బ్రూస్ లీని ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఇంటర్వెల్ లో శంకరాభరణం సినిమా ట్రయిలర్ ను చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బ్రూస్ లీ విడుదలైన రోజే.. శంకరాభరణం థియేట్రికల్ ట్రయిలర్ కూడా విడుదలవుతుంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు.
Next Story