Telugu Global
Others

అన్నింటికీ అదే `ఆధార్‌`ము కాదు

కేంద్రం అన్ని ప‌థ‌కాల‌కు ఆధార్‌ను లింక్ చేయాల‌నే ఉద్దేశంపై సుప్రీంకోర్టు నీళ్లు చ‌ల్లింది. అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం  సుప్రీం కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు చుక్కెదురైంది.  ప్రజా పంపిణీ, వంటగ్యాస్‌ మినహా దేనికీ ఆధార్‌ను వర్తింపజేయరాదన్న ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్త‌ర్వుల్లో మార్పులు చేయాల‌ని కోరుతూ కేంద్రం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. ప్ర‌జాపంపిణీ, వంట‌గ్యాస్ విష‌యంలో కూడా లబ్ధిదారులు అంగీకరిస్తేనే పరిగణనలోకి తీసుకోవాలన్న తాము ఇచ్చిన […]

కేంద్రం అన్ని ప‌థ‌కాల‌కు ఆధార్‌ను లింక్ చేయాల‌నే ఉద్దేశంపై సుప్రీంకోర్టు నీళ్లు చ‌ల్లింది. అన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు చుక్కెదురైంది. ప్రజా పంపిణీ, వంటగ్యాస్‌ మినహా దేనికీ ఆధార్‌ను వర్తింపజేయరాదన్న ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్త‌ర్వుల్లో మార్పులు చేయాల‌ని కోరుతూ కేంద్రం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. ప్ర‌జాపంపిణీ, వంట‌గ్యాస్ విష‌యంలో కూడా లబ్ధిదారులు అంగీకరిస్తేనే పరిగణనలోకి తీసుకోవాలన్న తాము ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్తర్వు కొనసాగుతుందని ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. అయితే, ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనం సమీక్షకు పంపేందుకు నిర్ణయించినట్లు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ సి.నాగప్పన్‌ల ధర్మాసనం ప్ర‌క‌టించింది.

First Published:  7 Oct 2015 6:36 PM IST
Next Story