దాద్రి సంఘటనపై పెదవి విప్పిన ప్రధాని మోడి
ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో జరిగిన సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడి తొలిసారిగా నోరు విప్పారు. గోమాంసం తిన్నారన్న ఆరోపణలతో మహ్మద్ అక్లాఖ్‌ను రాళ్ళతో కొట్టి చంపిన సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిన పది రోజుల తర్వాత తొలిసారిగా ఆయన పెదవి విప్పారు. దేశ విదేశాల్లో తిరుగుతూ జాతి సమైక్యత, సమగ్రతలపై ఉపన్యాసాలిస్తున్న ప్రధానమంత్రికి జాతిని కుదిపేసిన ఈ సంఘటన పట్టలేదా అంటూ దేశం నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ఉండాలని జాతీ […]

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో జరిగిన సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడి తొలిసారిగా నోరు విప్పారు. గోమాంసం తిన్నారన్న ఆరోపణలతో మహ్మద్ అక్లాఖ్‌ను రాళ్ళతో కొట్టి చంపిన సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిన పది రోజుల తర్వాత తొలిసారిగా ఆయన పెదవి విప్పారు. దేశ విదేశాల్లో తిరుగుతూ జాతి సమైక్యత, సమగ్రతలపై ఉపన్యాసాలిస్తున్న ప్రధానమంత్రికి జాతిని కుదిపేసిన ఈ సంఘటన పట్టలేదా అంటూ దేశం నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ఉండాలని జాతీ సమైక్యత కోసం పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం తగదని, ఒకరిపై మరొకరు నమ్మకాన్ని పెంచుకోవాలని ఆయన హితవు పలికారు. రాజకీయాల కోసం నాయకులు చేసే వివాదాస్పద ప్రకటనలను పట్టించుకోవద్దని మోడీ సూచించారు. రాష్ట్రపతి దాద్రి సంఘటనపై స్పందించిన తీరు అందరికీ అచరణీయమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, సహనం, సమానత్వం అనే మూల సూత్రాల ఆధారంగా భారత్ మనుగడ సాగిస్తోందని, ఈ సూత్రాలే దేశానికి బలమన్న రాష్ట్రపతి వ్యాఖ్యలు అనుసరణీయమని దేశ ప్రజలు వీటిని పాటించాలని మోడి కోరారు.