అభివృద్ధికే ఈసారి బీహార్ పట్టం: మోడీ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే ఈసారి బీహార్ ప్రజలు తమకు పట్టం కడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు. గత పాలకుల అసమర్ధ, అవినీతి చర్యలను కళ్ళారా చూసిన బీహార్ ఓటర్లు ముఖ్యంగా యువకులు అధికార పార్టీని గద్దె దింపడానికి ఉవ్విళ్ళూరుతున్నారని అభిప్రాయపడ్డారు. యువత ప్రస్తుతం శాసనసభకు జరగనున్న ఎన్నికల ద్వారా ప్రస్తుత పాలకులకు గుణపాఠం చెప్పడానికి సమాయత్తమవుతుందని తెలిపారు. ఎంతోకాలం నుంచి మార్పు చూడాలనుకుంటున్న బీహార్ యువతకు ఈ ఎన్నికలు ఓ మంచి […]
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే ఈసారి బీహార్ ప్రజలు తమకు పట్టం కడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు. గత పాలకుల అసమర్ధ, అవినీతి చర్యలను కళ్ళారా చూసిన బీహార్ ఓటర్లు ముఖ్యంగా యువకులు అధికార పార్టీని గద్దె దింపడానికి ఉవ్విళ్ళూరుతున్నారని అభిప్రాయపడ్డారు. యువత ప్రస్తుతం శాసనసభకు జరగనున్న ఎన్నికల ద్వారా ప్రస్తుత పాలకులకు గుణపాఠం చెప్పడానికి సమాయత్తమవుతుందని తెలిపారు. ఎంతోకాలం నుంచి మార్పు చూడాలనుకుంటున్న బీహార్ యువతకు ఈ ఎన్నికలు ఓ మంచి అవకాశమని మోడి అన్నారు. బీహార్‌లోని ముంగేరి ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ మంచి భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్న బీహార్ ప్రజలు ఈసారి జేడీయూ కూటమికి బుద్ధి చెప్పడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని మోడి తెలిపారు. ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలు ప్యాకేజీల కన్నా అభివృద్ధి కోరుకుంటున్నారన్న విషయం స్పష్టం తెలుస్తుందని ఆయన అన్నారు. బీహార్‌లో ఆటవిక పాలన కావాలో అభివృద్ధి పాలన కావాలో తేల్చుకోవాల్సింది ఇక ప్రజలేనని మోడి అన్నారు.