తలసాని రాజీనామా చేస్తే కదా ఉపఎన్నిక: నాయిని
తెలంగాణ హోంశాఖ మంత్రి నాయని నరసింహరెడ్డి కొత్త వివాదానికి తెర తీశారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఏ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని విలేఖరులు ప్రశ్నించగా ఆయన చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ఓ విలేఖరి సనత్‌నగర్ గురించి ప్రస్తావించగా అక్కడెందుకు ఉప ఎన్నిక వస్తుంది? తలసాని రాజీనామా చేస్తే కదా ఉప ఎన్నిక వచ్చేది అంటూ కుండబద్దలు గొట్టారు. దీంతో ఇపుడు కొత్త వివాదం తలెత్తినట్టే. ఇప్పటి వరకు తలసాని రాజీనామా స్పీకర్ వద్ద […]

తెలంగాణ హోంశాఖ మంత్రి నాయని నరసింహరెడ్డి కొత్త వివాదానికి తెర తీశారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఏ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని విలేఖరులు ప్రశ్నించగా ఆయన చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ఓ విలేఖరి సనత్‌నగర్ గురించి ప్రస్తావించగా అక్కడెందుకు ఉప ఎన్నిక వస్తుంది? తలసాని రాజీనామా చేస్తే కదా ఉప ఎన్నిక వచ్చేది అంటూ కుండబద్దలు గొట్టారు. దీంతో ఇపుడు కొత్త వివాదం తలెత్తినట్టే. ఇప్పటి వరకు తలసాని రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెబుతూ వస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఇది తలనొప్పులు తేవడం ఖాయం. అసలే అల్లుడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయని మరో కొత్త వివాదానికి తెర లేపి కొంగ్రొత్త సమస్యలో చిక్కుకున్నారు. తలసాని రాజీనామాని అస్ర్ర్తంగా చేసుకుని చాలా కాలంగా విమర్శిస్తున్న విపక్షాలకు నాయిని వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చే విదంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.