Telugu Global
Others

కేసీఆర్‌ హఠావో... కిసాన్‌ బచావో: నాగం

కేంద్రం ఆదేశాలను పాటించని పొగాకు వ్యాపారులను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కేంద్రం భావిస్తోంది. రైతుల ఆత్మహత్యలను నియంత్రించేందుకు పొగాకు కొనుగోళ్ళను చేపట్టాలని కోరినప్పటికీ వ్యాపారులు పట్టించుకోకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమవుతోంది. రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలని ఆదేశించినా వ్యాపారులు కొనుగోళ్లు జరపక పోవడంపై కేంద్రమంత్రి నిర్మలసీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశించినా వ్యాపారులు పొగాకు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పుల్లారావు కేంద్రమంత్రికి నివేదిక ఇచ్చారు. దీనిపై మంత్రి పుల్లారావుతోపాటు రైతు ప్రతినిధులు, […]

కేసీఆర్‌ హఠావో... కిసాన్‌ బచావో: నాగం
X

కేంద్రం ఆదేశాలను పాటించని పొగాకు వ్యాపారులను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కేంద్రం భావిస్తోంది. రైతుల ఆత్మహత్యలను నియంత్రించేందుకు పొగాకు కొనుగోళ్ళను చేపట్టాలని కోరినప్పటికీ వ్యాపారులు పట్టించుకోకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమవుతోంది. రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలని ఆదేశించినా వ్యాపారులు కొనుగోళ్లు జరపక పోవడంపై కేంద్రమంత్రి నిర్మలసీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశించినా వ్యాపారులు పొగాకు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పుల్లారావు కేంద్రమంత్రికి నివేదిక ఇచ్చారు. దీనిపై మంత్రి పుల్లారావుతోపాటు రైతు ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు, వాణిజ్యశాఖ ప్రతినిధులతో కేంద్రమంత్రి ఢిల్లీలో అత్యవసర సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. పొగాకు కొనుగోలు చేయని వ్యాపారులపై ఈ సమావేశంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఏఏ వ్యాపారులు కేంద్రం ఆదేశాలను పెడచెవిన పెట్టారో జాబితా తయారు చేయాలని కేంద్రమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలాంటి వారిని బ్లాక్‌లిస్టులో పెట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు చెబుతున్నారు.

First Published:  7 Oct 2015 9:20 PM GMT
Next Story