పరకాలలోకి కృష్ణమోహన్ పరకాయ ప్రవేశం
ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ లోకి కొత్తగా నియమితులైన కొత్త సమాచార శాఖ కమిషనర్ గా కృష్ణమోహన్ పరకాయ ప్రవేశం చేశారని జర్నలిస్టులు కొత్త భాష్యం చెబుతున్నారు. తన భార్య కేంద్రమంత్రి పదవే అర్హతగా మీడియా సలహాదారు పదవిలో కొనసాగుతున్నాడని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికితోడు మంత్రులను కూడా పూచిక పుల్ల కంటే హీనంగా పరకాల తీసి పడేస్తుండడంతో వారంతా గుర్రుగా ఉన్నారట. ప్రతీ విదేశీ పర్యటనకు పరకాలను బాబు వెంట తీసుకెళ్లడంతో మంత్రులు […]
ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ లోకి కొత్తగా నియమితులైన కొత్త సమాచార శాఖ కమిషనర్ గా కృష్ణమోహన్ పరకాయ ప్రవేశం చేశారని జర్నలిస్టులు కొత్త భాష్యం చెబుతున్నారు. తన భార్య కేంద్రమంత్రి పదవే అర్హతగా మీడియా సలహాదారు పదవిలో కొనసాగుతున్నాడని ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికితోడు మంత్రులను కూడా పూచిక పుల్ల కంటే హీనంగా పరకాల తీసి పడేస్తుండడంతో వారంతా గుర్రుగా ఉన్నారట. ప్రతీ విదేశీ పర్యటనకు పరకాలను బాబు వెంట తీసుకెళ్లడంతో మంత్రులు కూడా ప్రభాకర్‌కు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చారట. అదే ఇప్పుడు తమ కొంప ముంచిందని వాపోతున్నారట మంత్రులు.
పల్లె మంత్రి..పెత్తనం పరకాల
సమాచారశాఖ కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై ఉన్న రమణారెడ్డి ఉన్నంతకాలమూ పరకాల ప్రభాకర్‌దే హవా. దీనికితోడు సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా సాత్విక ధోరణిలో ఉండడంతో పరకాల ప్రభాకర్ సమాచారశాఖా మంత్రి పాత్ర కూడా తానే పోషిస్తూ వచ్చారనే విమర్శలున్నాయి. సమాచార, పౌరసంబంధాలశాఖ పరిధిలో ఏ పనైనా ప్రభాకర్ కలిస్తేనే అవుతుందనే ప్రచారం కూడా నిజం కావడంతో..మంత్రి పల్లె ఉత్సవ విగ్రహంగా మారిపోయారని సెక్రటేరియట్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇటీవల కాలంలో సమాచారశాఖను బాబు ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు.
సెటప్ మారేసరికి షటప్
సమాచారశాఖ కమిషనర్‌గా డిప్యూటేషన్ బాధ్యతలు నిర్వర్తించిన రమణారెడ్డి తన మాతృసంస్థకు వెళ్లిపోవడంతో పరకాలకు కష్టాలు మొదలయ్యాయి. కృష్ణమోహన్‌కు సమాచారశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన వెంటనే ఆయన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీఎంకు సంబంధించిన పరకాల ప్రభాకర్ అండ్ టీమ్ కనుసన్నల్లో సాగే వ్యవహారాలను ఒక్కసారిగా లాగేశారు. ఇంత వరకూ ఏపీ సీఎంకు చెందిన సమాచారాన్ని అంతా సీఎం మీడియా సలహాదారు పేరుతో పంపేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి..సమాచార శాఖ పేరుతోనే మీడియాకు సమాచారం అందజేస్తున్నారు. ప్రెస్ నోట్లలో ఉండే సీఎం సలహాదారు, ముఖ్యమంత్రి కార్యాలయం అనే విధానానికి స్వస్తి పలికారు.