అమరావతికి వెళ్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను మరింత తీవ్రం చేస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోన్న ఏపీ ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమానికి కూడా అనేకమంది వీవీఐపీలను ఆహ్వానిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ వేడుకకు లక్షమందిని ఆహ్వానిస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా వివిధ దేశాల ప్రధానులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రాజధాని శంకుస్థాపనకు అన్ని రాష్ట్రాల సీఎంలనూ ఆహ్వానిస్తున్నారు. ఇందులో […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను మరింత తీవ్రం చేస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోన్న ఏపీ ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమానికి కూడా అనేకమంది వీవీఐపీలను ఆహ్వానిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ వేడుకకు లక్షమందిని ఆహ్వానిస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా వివిధ దేశాల ప్రధానులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు.
రాజధాని శంకుస్థాపనకు అన్ని రాష్ట్రాల సీఎంలనూ ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నూ ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇన్విటేషన్ రెడీ చేస్తోందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక ఎవరు ఇస్తారు? చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారా? లేక మరెవరితోనైనా పంపుతారా? లేదా ఫోన్ కాల్ చేయనున్నారా? అన్నది చర్చనీయాంశమైంది. ఆమధ్య గవర్నర్ విందుకు ఆహ్వానిస్తే ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందితే సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది గులాబీ పార్టీలోనూ చర్చించుకుంటున్నారు.
ప్రధాని మోడీ కూడా హాజరవుతున్న ఈ వేడుకకు కేసీఆర్ వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన కూడా తెలంగాణ అధికారుల్లో కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.