Telugu Global
Others

ఉండవల్లి రిసెర్చ్‌- ఏపీకి ర్యాంకు ఎలా వచ్చిందంటే!

ఇటీవల పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రపంచబ్యాంకు దేశంలో రెండో ర్యాంకును కట్టబెట్టింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైన ప్రాంతమంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంకు రావడం వెనుక పెద్ద తతంగం,పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెబుతున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేసి ప్రపంచ బ్యాంకు నుంచి రెండో ర్యాంకు సంపాదించిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చోట చెట్లు ఉంటే […]

ఉండవల్లి రిసెర్చ్‌- ఏపీకి ర్యాంకు ఎలా వచ్చిందంటే!
X

ఇటీవల పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రపంచబ్యాంకు దేశంలో రెండో ర్యాంకును కట్టబెట్టింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైన ప్రాంతమంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంకు రావడం వెనుక పెద్ద తతంగం,పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెబుతున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన…

చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేసి ప్రపంచ బ్యాంకు నుంచి రెండో ర్యాంకు సంపాదించిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చోట చెట్లు ఉంటే వాటిని నరికేందుకు ఆన్‌లైన్‌లోనే అనుమతులిస్తామని నివేదికలోని ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానంగా చెప్పిందన్నారు. కానీ చెట్లు నరికేందుకు అనుమతి కావాలంటే దానికో పెద్ద ప్రాసెస్ ఉంటుందని ఉండవల్లి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని రోజుల్లో అనుమతిస్తారంటే… ఈ రోజు దరఖాస్తు చేసుకుంటే నిన్న సాయంత్రమే అనుమతి ఇచ్చేస్తామన్నట్టుగా ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు.

ఇలా అనేక విషయాల్లో ఏ రాష్ట్రం స్పందించని స్థాయిలో ఏపీ ప్రభుత్వం స్పందించిందని అందుకు ఏపీకి రెండో ర్యాంకు వచ్చిందన్నారు. అసలు ఈ సర్వే కూడా ప్రపంచబ్యాంకు నేరుగా చేయలేదన్నారు. ప్రధాని మోదీయే ఒక సంస్థతో చేయించారని ఉండవల్లి చెప్పారు. అందుకే గుజరాత్‌కు మొదటి ర్యాంకు కట్టబెట్టారన్నారు.

ఏపీకి రెండో ర్యాంకు రావడం వెనుక మరో కుట్ర కూడా ఉందన్నారు. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని ఏపీ ప్రజానికం అడుగుతున్న తరుణంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీకి రెండో ర్యాంకు ఇప్పించారన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రత్యేకహోదా అడగకుండా నోరు మూయించే ప్రయత్నం చేశారని ఉండవల్లి ఆరోపించారు.

First Published:  8 Oct 2015 2:20 AM GMT
Next Story