డాక్టర్ కింగ్ ఖాన్!
ఇది షారూఖ్ కొత్త సినిమా టైటిల్ కాదు.. విషయమేంటంటే..బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మరో అరుదైన పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటిగా పేరొందిన ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ షారూఖ్‌ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. అక్టోబరు 15న ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు షారూఖ్. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బెడ్‌ఫోర్డ్ షైర్ యూనివర్సిటీ షారూఖ్‌కు డాక్టరేట్ అందించిన విషయం తెలిసిందే! గతేడాది ఇదే ఎడిన్ […]
ఇది షారూఖ్ కొత్త సినిమా టైటిల్ కాదు.. విషయమేంటంటే..బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మరో అరుదైన పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒకటిగా పేరొందిన ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ షారూఖ్‌ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. అక్టోబరు 15న ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు షారూఖ్. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బెడ్‌ఫోర్డ్ షైర్ యూనివర్సిటీ షారూఖ్‌కు డాక్టరేట్ అందించిన విషయం తెలిసిందే!
గతేడాది ఇదే ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సైతం డాక్టరేట్ ప్రధానం చేయడం గమనార్హం. బుల్లి తెర నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన షారూఖ్ అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగాడు. రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. 2005లో పద్మ శ్రీ ని కూడా అందుకున్నాడు. ఎడిన్ బర్గ్ యూనివర్సిటీతో ఇండియాకు దాదాపు 250 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇందులో భాగంగానే భారత్‌లో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు డాక్టరేట్ అందించి సత్కరిస్తోంది.