సీఎం కాన్వాయ్ రహస్య వివరాలు లీక్
ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వివరాలకు సంబంధించిన పేపర్ ఒకటి బయటకు రావడం కలకలం రేపింది. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న చంద్రబాబు కాన్వాయ్ వివరాలు బయటకు రావడంతో భద్రతా సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. బయటకు వచ్చిన కాగితంలో కాన్వాయ్‌లో ఏ వాహనం ఎన్నో స్థానంలో ఉంటుందన్న విషయం స్పష్టంగా ఉంది. డ్రైవర్లు, వారి ఫోన్ నెంబర్లు కూడా అందులో ఉన్నాయి. కాగితంలో వివరాల బట్టి వరుసగా పైలట్ వాహనం, […]
ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ వివరాలకు సంబంధించిన పేపర్ ఒకటి బయటకు రావడం కలకలం రేపింది. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న చంద్రబాబు కాన్వాయ్ వివరాలు బయటకు రావడంతో భద్రతా సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు.
బయటకు వచ్చిన కాగితంలో కాన్వాయ్‌లో ఏ వాహనం ఎన్నో స్థానంలో ఉంటుందన్న విషయం స్పష్టంగా ఉంది. డ్రైవర్లు, వారి ఫోన్ నెంబర్లు కూడా అందులో ఉన్నాయి. కాగితంలో వివరాల బట్టి వరుసగా పైలట్ వాహనం, జామర్ కారు, ఎన్‌ఎస్‌జీ ఫ్రంట్, సీఎం కారు, ఎన్‌ఎస్‌జీ రేర్, ఎస్కార్ట్ 1, ఎస్కార్ 2, వీఐపీ కోసం అదనపు కారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వెహికల్ పయణిస్తాయి.
భద్రత కోసం కాన్వాయ్‌లోకి అన్ని కార్లకు ఓకే నెంబర్ ఏర్పాటు చేస్తారు. ఇంతటి ముఖ్యమైన కాగితం ఎలా బయటకు వచ్చిందన్న దానిపై సీఎం సెక్యూరిటీ వింగ్ విచారణ జరుపుతోంది. ఈ ఒక్క కాగితమేనా ఇంకా ఏమైనా వివరాలు బయటకు పొక్కాయా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. వివరాలు లీక్ అయిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు.