Telugu Global
Others

బాబు పాలనపై కేంద్రానికి కన్ను కుట్టిందా?

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన చరిత్ర ఎరుగని.. భవిష్యత్తు చూడలేని స్థాయిలో నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించిన వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం వద్ద బాబు పవర్ తగ్గిందా లేక రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రత్యేక హోదా ఇతర గ్రాంట్‌ల విషయంలో ఏపీ పట్ల అచితూచీ వ్యవహరిస్తున్న కేంద్రం తాజాగా అప్పులపై ఆంక్షలు విధించింది. అవసరమైన వాటికి కాకుండా పనికి […]

బాబు పాలనపై కేంద్రానికి కన్ను కుట్టిందా?
X

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన చరిత్ర ఎరుగని.. భవిష్యత్తు చూడలేని స్థాయిలో నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించిన వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం వద్ద బాబు పవర్ తగ్గిందా లేక రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రత్యేక హోదా ఇతర గ్రాంట్‌ల విషయంలో ఏపీ పట్ల అచితూచీ వ్యవహరిస్తున్న కేంద్రం తాజాగా అప్పులపై ఆంక్షలు విధించింది.

అవసరమైన వాటికి కాకుండా పనికి రాని చర్యలకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారంటూ కేంద్రం ఆంక్షల అస్త్రాన్ని తీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సెక్యూరిటీల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం అందుకు నో చెప్పింది. కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసేందుకు అంగీకరించింది. గతంలో ఎన్నడూ కూడా ఇలా రాష్ట్రంపై అప్పుల విషయంలో ఆంక్షలు విధించిన దాఖలాలు లేవు. మొదటి రెండు త్రైమాసికాల్లోనూ రాష్ట్రం అడిగిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అంగీకరించింది. అప్పుడు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.

ఇలా కేంద్రం ఆంక్షలు విధించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని రీతిలో ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రుల వరకు కోట్లను మంచినీటిని ఖర్చు చేస్తున్నారని కేంద్రం నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు. డబ్బులు లేవంటూనే ప్రత్యేక విమానాల్లో పదేపదే టూర్లు వేయడం, స్టార్ హోటళ్లలో సమావేశాలు పెట్టడం, దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాలు నిర్వహించడం ఇలా ప్రతి చర్యను కేంద్రం గమనిస్తూ వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

తాజాగా అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రం చేస్తున్న ఏర్పాట్లను చూసి కేంద్ర పెద్దలే ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. శంకుస్థాపన కోసం కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి… అతిధుల కోసం భారీగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను అద్దెకు సమకూర్చుకోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని సమాచారం. ఇలా తిరిగి పైసా కూడా ఆదాయం రాని వాటి కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం ప్రజాప్రభుత్వాలకు మంచిది కాదని కేంద్రవర్గాలు అభిప్రాయాపడుతున్నాయి. అందుకే అప్పుల విషయంలో ఆంక్షలు పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు.

First Published:  8 Oct 2015 12:00 PM IST
Next Story