శ్రీవారిని మ్రొక్కుకున్న రుద్రమదేవి
రుద్రమదేవి సినిమాపై ఇప్పుడిప్పుడే భారీ అంచనాలు పెరిగాయి. గోన గన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగడంతో అందరి చూపు రుద్రమదేవిపై పడింది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోస్ కూడా ఎరేంజ్ చేశారు నిర్మాతలు. హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో మాత్రమే రుద్రమదేవి సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోస్ ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. […]
BY sarvi8 Oct 2015 12:36 AM IST

X
sarvi Updated On: 8 Oct 2015 5:26 AM IST
రుద్రమదేవి సినిమాపై ఇప్పుడిప్పుడే భారీ అంచనాలు పెరిగాయి. గోన గన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగడంతో అందరి చూపు రుద్రమదేవిపై పడింది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోస్ కూడా ఎరేంజ్ చేశారు నిర్మాతలు. హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో మాత్రమే రుద్రమదేవి సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోస్ ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు రుద్రమదేవి టీం అంతా కలిసి శ్రీవారిని దర్శించుకుంది. దర్శకుడు గుణశేఖర్, ప్రధాన పాత్రధారి అనుష్క తిరుమలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫస్ట్ కాపీని స్వామివారి పాదాల ముందుంచారు. అంతా మంచి జరగాలని మనసారా కోరుకున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాకు లేనంత ఒత్తిడికి రుద్రమదేవి కోసం అనుభవించాడు గుణశేఖర్. తనే నిర్మాతగా మారి కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్ తెరకెక్కించాడు. సినిమా రిజల్ట్ ఏమాత్రం నెగెటివ్ గా వచ్చినా గుణశేఖర్ అడ్డంగా బుక్కయిపోవడం ఖాయం.
Next Story