అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఒవైసీ ప్రసంగాల తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజులపాటు కొనసాగాయి. మొత్తం 30 గంటల 6 నిమిషాలపాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగాయి. రెండు రోజులపాటు రైతు సమస్యలపై చర్చ జరగడం ఒక్కటే ఈ సమావేశాల ప్రత్యేకత. ఇంకో ప్రత్యేకత ఏమైనా ఉందంటే అది… విపక్ష సభ్యులను ఏకమొత్తంగా […]
అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఒవైసీ ప్రసంగాల తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజులపాటు కొనసాగాయి. మొత్తం 30 గంటల 6 నిమిషాలపాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగాయి. రెండు రోజులపాటు రైతు సమస్యలపై చర్చ జరగడం ఒక్కటే ఈ సమావేశాల ప్రత్యేకత. ఇంకో ప్రత్యేకత ఏమైనా ఉందంటే అది… విపక్ష సభ్యులను ఏకమొత్తంగా సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం. మొత్తం మీద సమావేశాలు అధికారపక్షం కావలసిన విధంగా జరుపుకుందనే అపప్రదతో ముగిశాయి.
మండలి కూడా నిరవధిక వాయిదా
గత నెల 23న శానసమండలి సమావేశాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇవాళ మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. మండలి సమావేశాల్లో రైతుల సమస్యలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, మార్కెటింగ్, ఇరిగేషన్‌తోపాటు పలు అంశాలపై చర్చించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు మాధానం ఇచ్చారు. మండలి ఉపాధ్యాక్షుడిగా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.