నేపాల్ లో ఆగని హింస
కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించి లౌకిక రాజ్యంగా మారిన నేపాల్ ఇప్పటికీ కుదురుకోలేకపోతోంది. భారత సంతతి తెగలు, స్థానికుల మధ్య చెలరేగిన హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోప్రభుత్వానికి అందోళనకారులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ అభ్యంతరాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగుతాయని యునైటెడ్ డెమొక్రటిక్ మాదేష్ ఫ్రంట్ ప్రకటించింది. 2015 సెప్టెంబర్ 20న నేపాల్ లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు అమలులో ఉన్న […]
BY sarvi7 Oct 2015 4:03 AM GMT
X
sarvi Updated On: 7 Oct 2015 4:03 AM GMT
కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించి లౌకిక రాజ్యంగా మారిన నేపాల్ ఇప్పటికీ కుదురుకోలేకపోతోంది. భారత సంతతి తెగలు, స్థానికుల మధ్య చెలరేగిన హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోప్రభుత్వానికి అందోళనకారులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ అభ్యంతరాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగుతాయని యునైటెడ్ డెమొక్రటిక్ మాదేష్ ఫ్రంట్ ప్రకటించింది.
2015 సెప్టెంబర్ 20న నేపాల్ లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు అమలులో ఉన్న రాచరిక వ్యవస్థ కూడా అంతరించిపోయింది. నేపాల్ ను 7 సమాఖ్య రాష్ట్రాలుగా విభజించారు. అయితే కొత్త రాజ్యాంగంలో తమ డిమాండ్లు నెరవేర్చలేదంటూ దక్షిణ నేపాల్ ప్రాంతంలోని మదేసి, థారు తెగలు ఆందోళనకు దిగాయి. నేపాల్ దక్షిణ ప్రాంతాన్ని మరిన్ని రాష్ట్రాలుగా విడగొట్టడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా తమ ఉనికికే ప్రమాదం తెస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రాన్ని పూర్వ స్థితిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సాంస్కృతికంగా ఇక్కడి మదేసీ ప్రజలకు భారత్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరి ఆందోళనకు భారత్ మద్దతు పలుకుతోందని స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు.
Next Story