Telugu Global
Others

ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు- లారీ ఢీ… మరో 15 మందికి గాయాలు నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా… 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెం. ఏపీ 20 జడ్‌ 2270. భువనగిరి నుంచి నల్గొండకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సు తుమ్మలగూడెం చేరుకోగానే వేగంగా వచ్చిన లారీ.. బస్సును బలంగా […]

ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం
X

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు- లారీ ఢీ… మరో 15 మందికి గాయాలు

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా… 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెం. ఏపీ 20 జడ్‌ 2270. భువనగిరి నుంచి నల్గొండకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సు తుమ్మలగూడెం చేరుకోగానే వేగంగా వచ్చిన లారీ.. బస్సును బలంగా ఢీ కొంది. దీంతో ఆర్టీ బస్సు పల్టీ కొట్టి రోడ్డు కిందకి దిగిపోయింది. భువనగిరి నుంచి నల్గొండ వెళ్ళతున్న ఈ బస్సు రామన్నపేటకు సమీపంలో ఇంద్రపాల్‌నగరం సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును హర్యానాకు చెందిన లారీ అత్యంత వేగంగా ఢి కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ ప్రమాదానికి గురైన తర్వాత రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.

ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. అంతా కకావికలమైపోయారు. నిముషాల వ్యవధిలో ఆ ప్రాంతం రక్తసిక్తమైపోయింది. బస్సు సీట్ల కింద, కిటీకీ అద్దాల్లో చిక్కుకుని చాలా మంది నుజ్జు నుజ్జు అయిపోయారు. మృత దేహాలు, గాయపడ్డవారి ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం బీభత్సంగా మారిపోయింది. లారీని పైకి లేపి, బస్సును సరైన క్రమంలో పెట్టడానికి భారీ క్రేన్లను హైదరాబాద్‌ నుంచి పంపినట్టు తెలిపారు. ప్రమాదంతో అప్రమత్తమైన ప్రయాణీకులు, స్థానికులు, పోలీసులు 108 వాహనంలో బాధితులను నార్కెట్‌పల్లి, రామన్నపేట ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి మృత దేహాలను రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు కండక్టర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.

ప్రమాదానికి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, బాధితులకు తగిన వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. ప్రమాదం పట్ట ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద స్థలికి హోం మంత్రి నాయని నర్సింహరెడ్డి, రవాణామంత్రి మహేంద్రరెడ్డి, మరో మంత్రి జగదీశ్వరరెడ్డి తరలి వెళ్ళారు. ఆర్టీసీ తరఫున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.

First Published:  7 Oct 2015 2:20 PM IST
Next Story