ప్రభాస్ అలా నేర్చుకుంటున్నాడు...
బాహుబలి సినిమాకు ప్రమోషన్ ఇచ్చే విషయంలో ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డాడు. మరీ ముఖ్యంగా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు హిందీ రాకపోవడంతో అక్కడక్కడ తడబడ్డాడు. ఇంగ్లిష్ లో మాట్లాడినప్పటికీ.. హిందీలో మాట్లాడితే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రభాస్ కు హిందీ అంతగా రాదు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు హిందీలో పర్ ఫెక్ట్ అనిపించుకునే పనిలో పడ్డాడు. బాహుబలి-2 సినిమా విడుదలయ్యేలోపే హిందీపై పట్టుసాధించాలని తహతహలాడుతున్నాడు. ఈసారి నేషనల్ మీడియాకు […]
BY sarvi7 Oct 2015 12:32 AM IST

X
sarvi Updated On: 7 Oct 2015 4:30 AM IST
బాహుబలి సినిమాకు ప్రమోషన్ ఇచ్చే విషయంలో ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డాడు. మరీ ముఖ్యంగా నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు హిందీ రాకపోవడంతో అక్కడక్కడ తడబడ్డాడు. ఇంగ్లిష్ లో మాట్లాడినప్పటికీ.. హిందీలో మాట్లాడితే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రభాస్ కు హిందీ అంతగా రాదు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు హిందీలో పర్ ఫెక్ట్ అనిపించుకునే పనిలో పడ్డాడు. బాహుబలి-2 సినిమా విడుదలయ్యేలోపే హిందీపై పట్టుసాధించాలని తహతహలాడుతున్నాడు. ఈసారి నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు హిందీలో ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఓవైపు జిమ్ లో కసరత్తులు చేస్తూనే.. మరోవైపు హిందీలో పాఠాలు నేర్చుకుంటున్నాడు. 30 రోజుల్లో హిందీ భాష లాంటి పుస్తకాలు చదవకుండా.. కాస్త సీరియస్ గానే హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం అన్ని రకాలుగా ప్రాక్టికల్ ట్రయినింగ్ తీసుకుంటున్నాడు ప్రభాస్. అంటే హిందీలో మాట్లాడ్డం, హిందీ సినిమాలు చూడ్డం, హిందీలోనే ప్రశ్నలు అడగడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Next Story