దేశవ్యాప్తంగా అక్టోబర్ 14న మెడికల్‌షాపుల బంద్
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను అక్టోబర్ 14న బంద్ పాటిస్తాయని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆలిండియా అసోసియేషన్ ప్రకటించింది. ఆన్‌లైన్ ఫార్మసీ రంగంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేసిన సంఘం.. ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సంఘంలో దేశవ్యాప్తంగా 8 లక్షల మంది సభ్యులున్నారు. 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇప్పటికే వైద్య ఆరోగ్యరంగాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటోందని అసోసియేషన్ అధ్యక్షుడు షిండే చెప్పారు. డాక్టర్ల కొరతతో సరైన వైద్యసేవలు […]
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను అక్టోబర్ 14న బంద్ పాటిస్తాయని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆలిండియా అసోసియేషన్ ప్రకటించింది. ఆన్‌లైన్ ఫార్మసీ రంగంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేసిన సంఘం.. ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సంఘంలో దేశవ్యాప్తంగా 8 లక్షల మంది సభ్యులున్నారు. 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇప్పటికే వైద్య ఆరోగ్యరంగాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటోందని అసోసియేషన్ అధ్యక్షుడు షిండే చెప్పారు. డాక్టర్ల కొరతతో సరైన వైద్యసేవలు అందడంలేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన..ఈ ఫార్మసీ విధానంతో మరిన్ని సమస్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొన్ని ఆంక్షలతో అమ్మే మందులు కూడా యథేచ్ఛగా అమ్మేస్తున్నారని, ఐపిల్స్, మత్తుకు బానిసలైనవారు కాఫ్ సిరప్‌లు కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉండడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజు బంద్ పాటించి తమ నిరసన తెలియజేస్తామని ఆయన చెప్పారు.