Telugu Global
Others

పెట్టుబడులకు స్వర్గధామం భారత్‌ : ప్రధాని మోడి

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో.. వ్యాపారానికి అనువైన పరిస్థితుల కల్పించడంలోను, పరిశ్రమలకు సులువుగా అనుమతుల మంజూరు చేయడం తదితర అంశాల్లో గణనీయమైన మార్పులు తెచ్చామని, భారత్ లోకి పెట్టుబడుల రాకను సులభతరం చేశామని ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. తన మానసపుత్రిక డిజిటల్‌ ఇండియా అనే సాప్ట్‌వేర్‌ ప్రపంచ హార్డ్‌వేర్‌ను కదిలించే సత్తా కలిగి ఉందని ఆయన అన్నారు. మంగళవారం బెంగుళూరులో జరిగిన ఇండో-జర్మన్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. నాస్కామ్‌ ఆధ్వర్యంలో జరిగిన […]

పెట్టుబడులకు స్వర్గధామం భారత్‌ : ప్రధాని మోడి
X

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో.. వ్యాపారానికి అనువైన పరిస్థితుల కల్పించడంలోను, పరిశ్రమలకు సులువుగా అనుమతుల మంజూరు చేయడం తదితర అంశాల్లో గణనీయమైన మార్పులు తెచ్చామని, భారత్ లోకి పెట్టుబడుల రాకను సులభతరం చేశామని ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. తన మానసపుత్రిక డిజిటల్‌ ఇండియా అనే సాప్ట్‌వేర్‌ ప్రపంచ హార్డ్‌వేర్‌ను కదిలించే సత్తా కలిగి ఉందని ఆయన అన్నారు. మంగళవారం బెంగుళూరులో జరిగిన ఇండో-జర్మన్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. నాస్కామ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మోర్కెల్‌తోపాటు ఇరు దేశాలకు చెందిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు హాజరయ్యాయి. పెట్టుబడిపెట్టే వారికి భారత్‌లో అనువైన పరిస్థితులున్నాయని చెబుతూ తమ ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్ణయాలను మోడి ఈ సమావేశంలో వివరించారు. మేథో సంపత్తి పరిరక్షణ ఇక్కడ బేషుగ్గా ఉందని, ఇక్కడ పెట్టుబడి పెట్టేవారి హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రగతిశీలంగా ఉండే విధంగా… ముందుచూపు కలిగిన సమగ్రమైన జాతీయ మేథో హక్కుల పరిరక్షణ ముసాయిదాను త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టామని, వచ్చే యేడాది దీన్ని అమలులోకి తేగలమని అన్నారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను, ప్రతిభను స్వీకరించడానికి భారత్‌ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మిగతా ప్రపంచ దేశాల పెట్టుబడులు క్షీణదశలో ఉండగా భారత్‌లో మాత్రం ఊపందుకున్నాయని, ప్రపంచం అంతా ఆర్థికంగా బలహీనంగా ఉండగా ఇక్కడ పటిష్టమైన పునాదులు కలిగి నమ్మకాన్ని పెంచుతోందని ప్రధాని మోడి తెలిపారు. జర్మన్‌ ఛాన్సలర్‌ మోర్కెల్‌ మాట్లాడుతూ జర్మన్‌ ఇంజినీర్లు, భారత్‌ ఐటీ నిపుణులు ఇక్కడ కలిసి పని చేస్తున్న తీరు అద్బుతమని ప్రశంసించారు. భారత్‌లో 1600కు పైగా జర్మన్‌ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయని, వాటిలో కొన్ని వందేళ్ళకు పైగా మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. ఐరాస భద్రతా మండలి సంస్కరణలకు బ్రెజిల్‌, జర్మనీ, భారత్‌, జపాన్‌లతోపాటు తాము కూడా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. భారత్‌లో తమ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ యేడాది మరో రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు బోష్‌ సంస్థ తెలియజేసింది. అంతకుముందు ప్రధానిమోడి, జర్మన్‌ ఛాన్సలర్‌ మోర్కెల్‌ కలిసి జర్మన్‌ ఆటోమోటివ్‌ సంస్థ బోష్‌ బెంగుళూరు ప్లాంట్‌ను ప్రారంభించారు.

First Published:  7 Oct 2015 1:22 AM IST
Next Story