Telugu Global
Others

మంగళగిరిలో ఎయిమ్స్‌కు కేంద్రం ఓకే

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు ప్రక్రియకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల మూడోవారం నుంచి పండుగల సీజన్ ప్రారంభం కానున్నవేళ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలన్ని ఆ శాఖ ప్రతిపాదనలకు మోడీ […]

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు ప్రక్రియకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల మూడోవారం నుంచి పండుగల సీజన్ ప్రారంభం కానున్నవేళ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలన్ని ఆ శాఖ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ పచ్చజెండా ఊపింది. దీని ద్వారా రైల్వే శాఖలోని మొత్తం 12 లక్షల మంది ఉద్యోగులు లబ్దిపొందనున్నారు. బోనస్ ల చెల్లింపుల వల్ల రైల్వే శాఖపై రూ.8 వేల కోట్ల అదనపు భారం పడనుంది

First Published:  6 Oct 2015 7:11 PM IST
Next Story