టీ-అసెంబ్లీ ముట్టడికి యూత్‌కాంగ్రెస్ యత్నం... అరెస్ట్‌లు
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యువజన కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. రైతు రుణమాఫీని వెంటనే ప్రకటించాలని, అన్నదాతల ఆత్మహత్యల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండు చేస్తూ వీరు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. రైతుల సమస్యలపై గళం విప్పిన ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని కూడా వీరు నిరసించారు. ఈ నిషేధాన్ని వెంటనే తొలగించాలని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గంగిరెద్దు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ […]
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యువజన కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. రైతు రుణమాఫీని వెంటనే ప్రకటించాలని, అన్నదాతల ఆత్మహత్యల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండు చేస్తూ వీరు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. రైతుల సమస్యలపై గళం విప్పిన ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని కూడా వీరు నిరసించారు. ఈ నిషేధాన్ని వెంటనే తొలగించాలని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గంగిరెద్దు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై వీరిని అడ్డుకున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతు రుణ మాఫీ, అసెంబ్లీ సభ్యుల సస్పెన్షన్‌పై నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకుపోతున్న వీరిని పోలీసులు నిరోధించడంతో ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది. అయితే కొద్ది సేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చింది.