ఇదేం భజన "కళా" ?
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసి రెండు రోజులు కూడా గడవలేదు. అప్పుడే కళావెంకటరావుకు భజన కళ వంటబట్టేసింది. చినబాబును బుట్టలో వేసుకునేందుకు ఏకంగా రైతుల్ని దొంగలంటూ .. వారిది దొంగ ఉద్యమమంటూ కొత్త భాష్యం చెప్పారు. అయితే కళావెంకటరావు రైతులను దొంగలతో పోల్చడాన్ని మిత్రపక్షమైన బీజేపీ వ్యతిరేకించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనలతో సర్కారును ఊపిరి తీసుకోనివ్వట్లేదు. భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా జగన్ ఆ […]
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసి రెండు రోజులు కూడా గడవలేదు. అప్పుడే కళావెంకటరావుకు భజన కళ వంటబట్టేసింది. చినబాబును బుట్టలో వేసుకునేందుకు ఏకంగా రైతుల్ని దొంగలంటూ .. వారిది దొంగ ఉద్యమమంటూ కొత్త భాష్యం చెప్పారు. అయితే కళావెంకటరావు రైతులను దొంగలతో పోల్చడాన్ని మిత్రపక్షమైన బీజేపీ వ్యతిరేకించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసనలతో సర్కారును ఊపిరి తీసుకోనివ్వట్లేదు. భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా జగన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. తమ కష్టాలను, ప్రభుత్వం తీరును బాధితులు జగన్‌కు వివరించారు. రైతులకు మద్దతుగా ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకోనివ్వనని జగన్ ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఈ ఉద్యమాన్ని పలుచన చేసేందుకు విషపూరిత వ్యాఖ్యలకు దిగుతున్నాయి.
అధ్యక్షుడైతే అంతేనా?
అంతలోనే ఎంత మార్పు అని ఏపీలోపి విపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. కిమిడి కళా వెంకటరావు అంటే.. తెల్లని వస్ర్తధారణ, నుదుట కుంకుమబొట్టుతో అత్యంత ప్రశాంతంగా, శాంతంగా బయటకు కనిపిస్తారు. వేషభాషలకు ఊతమిచ్చేలా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. ఎప్పుడూ కార్యాలయ వ్యవహారాలు, పార్టీ పెద్దలు అప్పగించిన పనిని తెర వెనుకుండి చక్కబెట్టడంలో కళా ..భళా అనిపించుకుంటారని టాక్. అటువంటి కిమిడి కళావెంకటరావు భోగాపురంలో విమానాశ్రయం భూ సేకరణకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నది దొంగ రైతులని ఆరోపించారు. బోగాపురం ప్రాంతానికి జగన్ వెళ్లడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ ఉత్తరాంధ్ర అబివృద్ధిని అడ్డుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూములలో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులవేనని, రైతుల భూములు అతికొద్దిగానే ఉన్నాయని కళా కొత్త లెక్కలు చెబుతున్నారు. అయితే భూసేకరణకు గ్రామాల వారీగా ఇచ్చిన నోటిఫికేషన్‌లో 5312 ఎకరాలు, 9 గ్రామాల్లో వందలాది రైతుల పేర్లున్నాయి. రైతులు చేస్తున్నది దొంగ ధర్నా అయితే.. రైతుల భూములంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా దొంగదేనా? అందులో పేర్కొన్న పేర్లు రైతులవి కావా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగిన కళా వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేగుతోంది. చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాపకం కోసమే కళా ఇలా దిగజారి మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మిత్రులారా ఇదేం పని?
విజయనగరం జిల్లా భోగాపురం లో రైతులను దొంగలతో పోల్చడం సరికాదని బిజెపి యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భోగాపురం వద్ద దొంగ రైతులను ప్రోత్సహించి దొంగ ధర్నాలు,దీక్షలు చేయిస్తున్నారని విపక్ష నేత జగన్ పై ఏపీ తెలుగుదేశం అద్యక్షుడు కిమిడి కళా వెంకటరావు చేసిన వ్యాఖ్యలను విష్ణువర్దన్‌రెడ్డి ఖండించారు. రైతులను అవమానించే విధంగా మాట్లొద్దని, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎపి ప్రభుత్వం విమానాశ్రయాల కోసం ఇంత పెద్ద ఎత్తున భూములు తీసుకోవలసిన అవసరం లేదని బీజేపీ అభిప్రాయపడుతోందని, దీనిపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారు.
బలిసినోడి భూముల్లో ఇమానాలు ఎగరవా?
ఉత్తరాంధ్ర ఉద్యమాలకు పెట్టింది పేరు. ఎటకారాలు కూడా ఎక్కువే. వ్యంగ్యం ధ్వనించే మాటలు.. నవ్విస్తాయి. ఆలోచింపజేస్తాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తమ భూములను ఇచ్చేది లేదని మొదటి నుంచీ పోరాడుతున్న ఓ నిరుపేద మహిళ.. తన కష్టాన్ని వ్యంగ్యంగా వ్యక్తీకరించింది. అందరినీ ఆలోచింపజేసింది. డబ్బులున్న నాయకుల భూములలో ఇమానాలు ఎగరవా అని బుజ్జి అనే ఆమె ప్రశ్నించారు.పేదల భూములలో అయితేనే ఎగురతాయా?అని అమాయకంగా అడుగుతోంది. భోగాపురం బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన విపక్ష నేత జగన్ సమక్షంలో ఆమె మాట్లాడారు. పంచభక్ష పరమాణ్ణం తినేవారిని వదలివేసి గంజి తాగేవారి భూములు లాక్కుంటారా?అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చకపోగా ,ఇప్పుడు మా భూములు లాక్కుంటారా అని ఆమె ప్రశ్నించారు.తమకు కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేస్తున్నారని, ఎందుకింత ఘోరానికి పాల్పడుతున్నారని బుజ్జి ప్రశ్నించారు.తమకు ప్రభుత్వం ఇచ్చే ముష్టి పరిహారం అవసరం లేదని, తమ తాత,తండ్రుల నుంచి వచ్చిన భూమి ఉంటే చాలని ఆమె అన్నారు.