అమెరికాను మనోళ్లు దున్నేస్తున్నారు!
అమెరికాలో మనోళ్లు విజృంభిస్తున్నారు. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో అమెరికాలో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ మన భారతీయులు అమెరికాపై చూపుతున్న ప్రభావాన్ని స్పష్టం చేసింది. అమెరికాలో సైన్స్, కంప్యూటర్, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారిలో భారతీయులపై పైచేయి అయి తేల్చింది. ఆసియా నుంచి వెళ్లి అమెరికాకు వెళ్లి సాప్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య మొత్తం 2. 96 మిలియన్లు. అందులో మన భారతీయ […]
అమెరికాలో మనోళ్లు విజృంభిస్తున్నారు. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో అమెరికాలో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ మన భారతీయులు అమెరికాపై చూపుతున్న ప్రభావాన్ని స్పష్టం చేసింది. అమెరికాలో సైన్స్, కంప్యూటర్, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారిలో భారతీయులపై పైచేయి అయి తేల్చింది.
ఆసియా నుంచి వెళ్లి అమెరికాకు వెళ్లి సాప్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య మొత్తం 2. 96 మిలియన్లు. అందులో మన భారతీయ సంఖ్య ఏకంగా 9.5 లక్షలు. 2003 నుంచి 2013 మధ్య కాలంలో ఈ పెరుగుదల ఏకంగా 85 శాతంగా ఉంది. ఆసియా నుంచి 2003- 2013 మధ్య కాలంలో అమెరికా దారి పట్టిన వారి సంఖ్య 21. 6 నుంచి 29 మిలియన్లకు పెరిగింది.
అమెరికాలో కంప్యూటర్, సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 57 శాతం మంది ఆసియా దేశాల నుంచి వెళ్లిన వారే. 20 శాతం మంది నార్త్ , సెంట్రల్, సౌత్ అమెరికాకు చెందిన వారు. మరో 16 శాతం మంది యూరప్ దేశాలకు చెందిన వారు. 6 శాతం మంది ఆఫ్రికా దేశాల నుంచి వచ్చారు. విద్యాపరంగానూ మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ కలిగిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు.