హెల్మెట్ లేకున్నా... పెట్రోలు పోస్తారంట!
నో హెల్మెట్ – నో పెట్రోలు అన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే.. రూ.1000 ఫైన్ వేయాలని నిర్ణయించింది తెలంగాణ రవాణాశాఖ. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు కోర్టులో పిల్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ముందు అవగాహన కల్పించాలని సూచించింది. దీంతో రూ.1000 ఫైన్ విషయాన్ని పక్కనబెట్టింది. బండి […]
నో హెల్మెట్ – నో పెట్రోలు అన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే.. రూ.1000 ఫైన్ వేయాలని నిర్ణయించింది తెలంగాణ రవాణాశాఖ. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు కోర్టులో పిల్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ముందు అవగాహన కల్పించాలని సూచించింది. దీంతో రూ.1000 ఫైన్ విషయాన్ని పక్కనబెట్టింది. బండి కొనే సమయంలోనే హెల్మెట్ తప్పనిసరిగా కొనాలన్న మరో ప్రతిపాదన తీసుకువచ్చింది. దీనిపైనా కొందరు హైకోర్టులో పిల్ వేశారు. స్పందించిన కోర్టు.. దాన్ని మానుకోవాలని సూచించింది. అదే సమయంలో హెల్మెట్ వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని హితవు పలికింది.
బంకుల్లో హెల్మెట్‌తో వచ్చిన వారికే పెట్రోలు అన్న తప్పనిసరి నిబంధనను అమలు చేస్తే ఎలా ఉంటుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రతిపాదించారు. కానీ, దీనిపై పలువురు జిల్లా కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన కల్పించకుండా నిర్ణయాన్ని అమలు చేస్తే.. మరోసారి భంగపాటు తప్పదని మంత్రికి వివరించారు. దీంతో ఈ ప్రతిపాదననూ ప్రస్తుతానికి అటకెక్కించారు. ఇప్పటికే హెల్మెట్ వినియోగంపై నగరంలోని పలు కూడళ్ల వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు అవగాహన కల్పిస్తున్నారు. మరికొంతకాలం తరువాత హెల్మెట్‌పై రూ.1000 చలానాకే మొగ్గు చూపుతుందని సమాచారం.