Telugu Global
Others

అసెంబ్లీ నుంచి విపక్షం మొత్తం సస్పెన్షన్‌

అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులందరినీ స్పీకర్‌ మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, వామపక్షాల సభ్యులందరినీ ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఒకేసారి రైతుల రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తూ ఎంఐఎం మినహా మిగిలిన సభ్యులంతా నినాదాలు చేయడం మొదలెట్టారు. ప్రభుత్వం సర్ధి చెప్పినప్పటికీ వారు శాంతించలేదు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండు చేస్తూ ప్రతిపక్షాలు గందరగోళం స్పష్టించడంతో కాంగ్రెస్‌ శాసనసభ పక్ష […]

అసెంబ్లీ నుంచి విపక్షం మొత్తం సస్పెన్షన్‌
X

అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులందరినీ స్పీకర్‌ మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, వామపక్షాల సభ్యులందరినీ ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఒకేసారి రైతుల రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తూ ఎంఐఎం మినహా మిగిలిన సభ్యులంతా నినాదాలు చేయడం మొదలెట్టారు. ప్రభుత్వం సర్ధి చెప్పినప్పటికీ వారు శాంతించలేదు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండు చేస్తూ ప్రతిపక్షాలు గందరగోళం స్పష్టించడంతో కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత బాగారెడ్డి , ఆర్‌. కృష్ణయ్య మినహా మిగిలిన విపక్ష సభ్యులందరినీ ఈ సమావేశాలు మొత్తం ముగిసేవరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆధారం చేసుకుని స్పీకర్‌ మధుసూదనాచారి ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే సభ్యులంతా బయటికి వెళ్లిపోవాలని స్పీకర్‌ ఆదేశించారు. వారు స్పందించక పోవడం… నిరసన మానకపోవడంతో మార్షల్స్‌ ఒక్కక్కొరిని బయటకు తీసుకువచ్చారు. అసెంబ్లీ బయటే కూర్చుని వారు నినాదాలు చేస్తున్నారు.

First Published:  5 Oct 2015 5:01 AM IST
Next Story