Telugu Global
Others

చంద్రబాబు దుర్యోధనుడు అయితే నేను కర్ణుడిని: రేవంత్‌

”నాకు మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడి స్నేహం అంటే చాలా ఇష్టం. నేను కూడా చంద్రబాబు కోసం కర్ణుడిలా పనిచేయాలనుకుంటాను”. చంద్రబాబు మనసు గెలిచేందుకు అన్నారో లేక మనస్పూర్తిగా చెప్పారో గానీ కొన్ని నెలల క్రితం( ఓటుకు నోటు కేసుకు ముందే) మనసు విప్పి మాట్లాడుకునే ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖలు ఇవి. రేవంత్ రెడ్డికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఇప్పుడా వ్యాఖ్యలను గుర్తుకు చేసుకుంటున్నారు. రేవంత్ కర్ణుడిలాగే నమ్మకంగా […]

చంద్రబాబు దుర్యోధనుడు అయితే నేను కర్ణుడిని: రేవంత్‌
X

”నాకు మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడి స్నేహం అంటే చాలా ఇష్టం. నేను కూడా చంద్రబాబు కోసం కర్ణుడిలా పనిచేయాలనుకుంటాను”. చంద్రబాబు మనసు గెలిచేందుకు అన్నారో లేక మనస్పూర్తిగా చెప్పారో గానీ కొన్ని నెలల క్రితం( ఓటుకు నోటు కేసుకు ముందే) మనసు విప్పి మాట్లాడుకునే ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖలు ఇవి. రేవంత్ రెడ్డికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఇప్పుడా వ్యాఖ్యలను గుర్తుకు చేసుకుంటున్నారు.

రేవంత్ కర్ణుడిలాగే నమ్మకంగా పనిచేసినా చంద్రబాబు మాత్రం టీటీడీపీ రాజ్యానికి రాజును చేయలేదని యువనేత సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు కదా అన్న ప్రశ్నకు రేవంత్ సన్నిహితులు కొత్త లెక్కలు చెబుతున్నారు.

రేవంత్ రాజకీయ జీవితాన్ని ఓటుకు నోటుకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా చూడాలంటున్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం ద్వారా రేవంత్ రెడ్డిపై మచ్చ పడినప్పటికీ … తెలంగాణలో ఆయన క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో పెరిగిందని చెబుతున్నారు. కేసీఆర్‌ వ్యతిరేకించే వారంతా టీఆర్ఎస్‌కు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే అన్న అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఓటుకు నోటు ద్వారా రేవంత్ ఇమేజ్ పీక్‌కు వెళ్లిపోయిందంటున్నారు.

తెలంగాణ అధ్యక్ష పదవి కోసం కార్యకర్తల నుంచి మొబైల్ ఫోన్ సర్వే నిర్వహిస్తే రేవంత్ రెడ్డికి ఎవరూ ఊహించని స్థాయిలో మద్దతు వచ్చిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాయమని భావించామని కానీ .. కొందరు సీనియర్ల మాటలు విని రేవంత్‌కు చంద్రబాబు అన్యాయం చేశారని చెబుతున్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవి దక్కలేదంటే భవిష్యత్తులో కూడా అది దక్కడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. అసలు రేవంత్ ఎదుగుదల అధినాయకత్వానికే ఇష్టం లేదేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన వ్యక్తిని ఏకంగా అధ్యక్షుడిని చేయడం సరికాదని భావించి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు రేవంత్ వర్గం గట్టి సమాధానమే చెబుతోంది. ఓటుకు నోటులో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు కూడా ఆడియో సాక్ష్యాలతో దొరికిపోయారు కదా… మరి చంద్రబాబు ఏమైనా రాజీనామా చేశారా అని ప్రశ్నిస్తున్నారు.

సాక్ష్యాలతో సహా పట్టుబడిన తర్వాత కూడా చంద్రబాబు అన్ని పదవులను అంతే స్థాయిలో అనుభవించడం లేదా అని ఆఫ్ లైన్‌లో నిలదీస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ప్రేమతో ఇచ్చినట్టు లేదని… రేవంత్ రెడ్డి ఎదురుమాట్లాడకుండా నోరు కట్టేసేందుకు కట్టబెట్టినట్టుందని రేవంత్ రెడ్డి సన్నిహితులు అభిప్రాయపడతున్నారు.

First Published:  5 Oct 2015 3:37 AM IST
Next Story