చిరుత కోసం చిరు ఒంటరి
మెగాస్టార్ తనయుడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్‌తేజ్ ఒంటరయ్యాడా? తనయుడి కోసం తండ్రి కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందా? ఇవే అనుమానాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు సినిమాల్లో చిరుత పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉండడంతో చిరు చింతా క్రాంతుడవుతున్నాడట! సినిమా, పాలిటిక్స్ ద్వారా సంపాదించిన పేరు ప్రతిష్ట ఆస్తులు కొడుకు కరగదీసే అవకాశాలున్నాయనే బెంగ మెగాస్టార్‌ను పట్టిపీడిస్తోందట. సినిమాలు అంతంత మాత్రమే! రాంచరణ్ ఫస్ట్ మూవీ చిరుత ..సోసోగా ఆడింది. చెర్రీ కెరీర్‌లో […]
మెగాస్టార్ తనయుడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్‌తేజ్ ఒంటరయ్యాడా? తనయుడి కోసం తండ్రి కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందా? ఇవే అనుమానాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు సినిమాల్లో చిరుత పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉండడంతో చిరు చింతా క్రాంతుడవుతున్నాడట! సినిమా, పాలిటిక్స్ ద్వారా సంపాదించిన పేరు ప్రతిష్ట ఆస్తులు కొడుకు కరగదీసే అవకాశాలున్నాయనే బెంగ మెగాస్టార్‌ను పట్టిపీడిస్తోందట.
సినిమాలు అంతంత మాత్రమే!
రాంచరణ్ ఫస్ట్ మూవీ చిరుత ..సోసోగా ఆడింది. చెర్రీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అంటే మగధీరే. ఈ సినిమా విజయం రాజమౌళి ఖాతాలోకి చేరింది. ఇక అక్కడ్నించి ఆరెంజ్ అట్టర్‌ఫ్లాఫ్. రచ్చ ఫర్వాలేదనిపించినా..దీనిని తుఫాన్ ఊడ్చుకుపోయింది. ఎవడు ఏవరేజ్‌గా నిలిచింది. గోవిందుడు అందరివాడేలే అంతంతమాత్రమే. ఈ పరిస్థితి చూసిన చిరంజీవి కొడుకు కెరీర్‌పై దృష్టి సారించాల్సిందేననే నిర్ణయానికి వచ్చాడట. అందుకే పాలిటిక్స్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నాడని ప్రచారం సాగుతోంది
వ్యాపారంలో నష్టాలే!
చెర్రీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రూజెట్ నష్టాల్లో నడుస్తోంది. దీంతోపాటు సర్వీసులు రద్దు, అధ్వాన సర్వీసులు లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉంది. ఎన్నో ఆశలు ప్రారంభించిన విమానయాన వ్యాపారం కలిసి రాలేదు. పోనీ నిర్మాతగా అవతారం ఎత్తుదామనుకున్నా..బేరం బెడిసి కొట్టిందని సమాచారం. బాబాయ్ పవన్‌తో ప్రకటించిన సినిమా అటకెక్కింది. తండ్రితో తీద్దామనుకున్న 150 సినిమాపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సో సినీ నిర్మాణరంగంలోనూ చెర్రీకి చెప్పుకోదగ్గ పరిస్థితి లేదు
తనయుడిని నిలబెట్టేందుకు తండ్రి
తన పేరుమీద పరిశ్రమకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరోలంతా దూసుకుపోతుంటే..తన కొడుకు మాత్రం వెనకబడిపోవడం చిరు జీర్ణించుకోలేకపోతున్నారట. పవన్‌కల్యాణ్, బన్నీ, సాయిధరమ్‌తేజ్, వరుణ్ తేజ్ లు తన పేరు మొదట్లో వాడుకున్నా..తమకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారని, చెర్రీ మాత్రం ఇంకా తన ఇమేజ్‌పైనే ఆధారపడి ఉన్నాడని గ్రహించారట చిరంజీవి.
బ్రూస్‌లీకి బూస్ట్ ఇచ్చేందుకు..
బ్రూస్‌లీ సినిమా ప్రారంభంలో చిరు క్యారెక్టర్ లేదు. ఎప్పుడైతే చరణ్ కు ఎదురుగాలి వీస్తుందో.. వెంటనే రంగంలోకి దిగారట మెగాస్టార్. శ్రీనువైట్ట, కోన వెంకట్ లతో మాట్లాడి తాను మెరుపులా మెరిసి సినిమా విజయానికి, తన కొడుకు కెరీర్‌కు హెల్ప్ అవ్వాలనే ఆలోచనను పంచుకున్నారట. దీంతో చిరు బ్రూస్‌లీలో తప్పనిసరిగా యాక్ట్ చేయాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్న మాట.
ఫంక్షన్‌లో ఒంటరై..
తాజాగా ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్‌కు పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, నాగబాబు కూడా దూరంగా ఉన్నారు. చిరంజీవితోపాటు రాంచరణ్ తేజ్ అన్నీ తానై ఫంక్షన్‌ను నడిపేశాడు. దీంతో చరణ్ కోసం చిరు ఒంటరైపోయాడనే గుసగుసలు వినిపించాయి.