నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అస్తమయం
సాగర సంగమం వంటి ఆణిముత్యం సినిమా ద్వారా తెలుగు సినిమాకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే.. ఆ ఖ్యాతిలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు సింహభాగం ఉందనే చెప్పాలి. ఈ వెటరన్ ప్రొడ్యూసర్ ఈ రోజు శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏర్పడిన కాంప్లికేషన్స్ వలన తను స్టార్ హాస్పిటల్‌లో కన్నుమూసినట్లు కడపటి వార్తలు తెలుపుతున్నాయి. తెలుగు వారు నిర్మించిన క్లాసిక్స్‌లో అధిక భాగం ఏడిద నాగేశ్వరరావు తన పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పైన […]
సాగర సంగమం వంటి ఆణిముత్యం సినిమా ద్వారా తెలుగు సినిమాకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే.. ఆ ఖ్యాతిలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు సింహభాగం ఉందనే చెప్పాలి. ఈ వెటరన్ ప్రొడ్యూసర్ ఈ రోజు శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏర్పడిన కాంప్లికేషన్స్ వలన తను స్టార్ హాస్పిటల్‌లో కన్నుమూసినట్లు కడపటి వార్తలు తెలుపుతున్నాయి.
తెలుగు వారు నిర్మించిన క్లాసిక్స్‌లో అధిక భాగం ఏడిద నాగేశ్వరరావు తన పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించిననవే. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సితార, సిరిసిరిమువ్వ, సీతాకోక చిలుక, ఆపద్భాంధవుడు వంటి ఆణిముత్యాలు అన్నీ ఏడిద నాగేశవరరావు మరియు కళాతపస్వి కె.విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన గొప్ప చిత్రాలు.
ఆయన అంత్యక్రియలు రేపు సోమవారం, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో జరుగుతాయి. అంతకుముందు ఫిలిం నగర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచుతారు. పలువురు ప్రముఖులు ఏడిద నాగేశ్వరరావుకు తమ సంతాపం తెలిపి తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నిర్మాతను కోల్పోయిందని గుర్తుచేసుకున్నారు.