Telugu Global
Others

ప్రమాణంలో పదనిసలు- తెలుగును నమిలేసిన గజపతి, పెద్దిరెడ్డి డుమ్మా

నూతనంగా ప్రకటించిన టీడీపీ పొలిట్‌ బ్యూరో, కేంద్ర, ఉభయరాష్ట్రాల కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో జరిగింది.  కమిటీల సభ్యుల చేత చంద్రబాబు  ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి గైర్హాజరయ్యారు. తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వకుండా అవమానించారన్న అసంతృప్తి కారణంగా ఆయన రాలేదని సమాచారం. టీడీపీ గ్రేటర్ అధ్యక్ష పదవి […]

ప్రమాణంలో పదనిసలు- తెలుగును నమిలేసిన గజపతి, పెద్దిరెడ్డి డుమ్మా
X

నూతనంగా ప్రకటించిన టీడీపీ పొలిట్‌ బ్యూరో, కేంద్ర, ఉభయరాష్ట్రాల కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో జరిగింది. కమిటీల సభ్యుల చేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి గైర్హాజరయ్యారు. తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వకుండా అవమానించారన్న అసంతృప్తి కారణంగా ఆయన రాలేదని సమాచారం. టీడీపీ గ్రేటర్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో అసంతృప్తికి లోనైన కృష్ణయాదవ్ కూడా రాలేదు. కారణాలు తెలియకపోయినా ఎర్రబెల్లి కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. కార్యక్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి అంటిముట్టనట్టు ఉన్నారు. సభ్యులంతా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి ఓ చివర నిల్చొని ప్రమాణం చేశారు. ఆ సమయంలో చంద్రబాబుకు ఇరువైపుల ఎల్. రమణ, కళా వెంకట్రావ్ నిల్చుని ఉన్నారు.

2019 ఎన్నికల గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి నేతల పనితీరుపై మూడు నెలలకోసారి ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారు.

కార్యక్రమానికి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆలస్యంగా వచ్చారు. దీంతో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఆయనతో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రమాణం చేయించారు. తెలుగులో ప్రమాణస్వీకారం చేసేందుకు గజపతిరాజుకు చుక్కలు కనిపించాయి. ప్రమాణ పత్రాన్ని ఆగిఆగి చదువుతూ… పదాలను మింగేస్తూ, వాటిని ఎక్కడికక్కడ కట్ చేస్తూ అతి కష్టం మీద దేవుడా అనిపించారు. ”పవిత్ర భారతావని” అన్న పదాన్ని… ”పదవి భారత వాణి” అని సంబోధించారు. ”ఆదర్శవంతమైన” అన్న మాటను ”ఆదర్శ్ వంత్‌”మైన అంటూ పలికారు. ”అవిశ్రాంత కృషి” అన్న పదం రూపురేఖలనే మార్చేశారు కేంద్రమంత్రి. ”అవిరల కృషి చేస్తాను” అని పలికారు. ”సమాజం కొరకు” అన్న పదాన్ని ”సమాజం కొరుకు” అని అశోక్‌ గజపతి రాజు అన్నారు.

First Published:  4 Oct 2015 9:04 AM IST
Next Story