చిరంజీవికి సినిమా కష్టాలు..మెగా ఫిల్మ్ పాలిటిక్స్
మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్‌ను వదిలి మళ్లీ సినిమావైపు చూపు మరల్చారు. అదే సమయంలో మెగా కుటుంబంలో `ఫిల్మ్` పాలిటిక్స్ మొదలయ్యాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగబాబు, పవన్ కల్యాణ్ అన్నయ్యే మా లోకం అంటారు. కానీ మాట్లాడుకోరు. పలకరించుకోరు. అన్నయ్య కాంగ్రెస్ బచావో అంటే..తమ్ముడు పవన్ కాంగ్రెస్ హఠావో అని పిలుపిస్తాడు. ఒకరి సినిమా ఫంక్షన్‌లో మరొకరు కనిపించరు. ఇదే ఇటీవల కాలంలో బాగా ఎక్కువైంది. మెగా కాంపౌండ్‌లో ఎందుకీ పాలిటిక్స్ అని ఆరా తీస్తే..ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. […]
మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్‌ను వదిలి మళ్లీ సినిమావైపు చూపు మరల్చారు. అదే సమయంలో మెగా కుటుంబంలో 'ఫిల్మ్' పాలిటిక్స్ మొదలయ్యాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగబాబు, పవన్ కల్యాణ్ అన్నయ్యే మా లోకం అంటారు. కానీ మాట్లాడుకోరు. పలకరించుకోరు. అన్నయ్య కాంగ్రెస్ బచావో అంటే..తమ్ముడు పవన్ కాంగ్రెస్ హఠావో అని పిలుపిస్తాడు. ఒకరి సినిమా ఫంక్షన్‌లో మరొకరు కనిపించరు. ఇదే ఇటీవల కాలంలో బాగా ఎక్కువైంది. మెగా కాంపౌండ్‌లో ఎందుకీ పాలిటిక్స్ అని ఆరా తీస్తే..ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి.
అందరూ హీరోలే..అందుకే ఇగోలు
మెగాస్టార్ కంటే పవర్‌స్టార్ కు పవరెక్కువ. రాంచరణ్ తేజ్ కంటే వరుణ్ తేజ్‌కు గ్లామర్ ఎక్కువ. అల్లు అర్జున్‌కు సాయిధరమ్ తేజ్ పోటీ అయ్యేలా ఉన్నాడు. ఇక్కడే అసలు పోరాటం ప్రారంభమైందంటున్నారు సినీ విమర్శకులు. అందరూ బంధువులే. కానీ అందరూ హీరోలు ఇక్కడే అసలు సమస్య. ఒకరు ముందుకు దూసుకెళితే మరొకరు వెనకబడిపోతారు. సినిమా పరిశ్రమ అంటే పోటీ. పరుగుపందెం. ఒక హిట్ వస్తే ఎవరూ పట్టలేరు. ఒక్కటి ఫట్టయితే ఎవరూ పట్టించుకోరు. ఈ పోటీ మెగా ఫ్యామిలీ హీరోల మధ్య గ్యాప్ కారణమైందనే విశ్లేషణలున్నాయి.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు..
మెగా కాంపౌండ్ హీరోలకు పునాదిరాళ్లు వేసి ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేసింది చిరంజీవి. తన స్వయంకృషితో అందరివాడు అనిపించుకున్న చిరు.. తానే ఒక బ్రాండ్‌గా తన ఫ్యామిలీ హీరోలకు లిఫ్ట్ ఇచ్చాడు. సోదరుడు నాగబాబు, మరో సోదరుడు పవన్ కల్యాణ్, బావ అల్లుఅరవింద్ కొడుకు బన్నీ, తన కొడుకు రామ్‌చరణ్ తేజ్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నీహారిక, మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో పాటు దూరపు బంధువుల ఎందరో మెగా వెలుగులో వెండితెరపైకొచ్చారు. వీళ్లెవరూ ఫెయిల్యూర్ కాలేదు. ఒక్క అల్లు శిరీష్, దూరపు బంధువైన దర్శకుడు మెహర్ రమేష్ తప్పించి..అందరూ తమ సత్తా చాటుకున్నారు. ఇక్కడే మనుగడ సమస్య మొదలైంది.
సినీమాయ
చిరంజీవి మేనల్లుడైన సాయిధరమ్‌తేజ్ మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇటీవలే విడుదలైంది. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నంతలోనే..చిరంజీవి ఆత్మలాంటి బావ అల్లు అరవింద్ కొడుకు బన్నీ కీలక పాత్ర పోషించిన రుద్రమదేవి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రుద్రమదేవి కంటే ముందు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కంచె రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తమ కుటుంబ హీరోల సినిమా మధ్య చిక్కుకోవడం ఇష్టంలేని వరుణ్..ఇతరులెవరి సినిమాలు వాయిదా పడే అవకాశం లేకపోవడంతో తన సినిమానే వాయిదా వేసుకున్నాడని ఫిల్మ్‌నగర్ గుసగుస. హిట్ మొఖం చూసి చాలారోజులైన చిరు తనయుడు రాంచరణ్‌తేజ్ బ్రూస్ లీ కూడా విడుదలకు సిద్ధమైంది. ఎవరి సినిమా ముందు రిలీజవ్వాలి? ఎవరు వెనక్కు తగ్గాలి? ఇక్కడే మొదలైందట సమస్య. వరుసగా ఒకే కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు వచ్చి అపజయం పాలైతే..అందరికీ దెబ్బ. ఒక వేళ సినిమా హిట్ అయినా వెంటనే మరో మెగా ఫ్యామిలీ హీరో మూవీ పడితే అదో రకమైన నష్టం. ఈ కారణాలతోనే మెగా కుటుంబంలో కలహాలు వచ్చాయని సమాచారం. చిరంజీవి పాలిటిక్స్‌కు తాత్కాలికంగా దూరం జరిగినా.. కుటుంబంలో సినీ రాజకీయాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.