హీరో రామ్‌చరణ్ పేరిట యాప్
మెగా ఫ్యామిలీ ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకత కోసం ప్రయతిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇపుడు హీరో రామ్‌చరణ్ తనకంటూ ఓ ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను తయారు చేయించుకున్నాడు. ఇలా సొంతంగా యాప్‌ను రూపొందించుకున్న తొలి దక్షిణాది హీరోగా చరణ్ రికార్డు సృష్టించాడు. ఇక కొత్తగా ప్రారంభించిన యాప్ గురించి రామ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వినోదాత్మకమైన వీడియోను పోస్టు చేశాడు. తాను తయారు చేయించుకున్న యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ […]
BY sarvi4 Oct 2015 12:36 AM IST

X
sarvi Updated On: 4 Oct 2015 10:07 AM IST
మెగా ఫ్యామిలీ ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకత కోసం ప్రయతిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇపుడు హీరో రామ్‌చరణ్ తనకంటూ ఓ ప్రత్యేక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను తయారు చేయించుకున్నాడు. ఇలా సొంతంగా యాప్‌ను రూపొందించుకున్న తొలి దక్షిణాది హీరోగా చరణ్ రికార్డు సృష్టించాడు. ఇక కొత్తగా ప్రారంభించిన యాప్ గురించి రామ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వినోదాత్మకమైన వీడియోను పోస్టు చేశాడు. తాను తయారు చేయించుకున్న యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపాడు. చరణ్ సినిమాలకు సంబంధించిన వార్తలు, ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్స్, టీజర్స్ ఇకనుంచి ఈ యాప్ ద్వారా తిలకించొచ్చు. ఈ యాప్‌ను కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తయారు చేసినట్లు చరణ్ తెలిపారు.
Next Story