ఏదో ఒకటి చెప్పండి... చైనా పిలుస్తోంది!
దౌత్యపరంగా అంతర్జాతీయ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తానంటూ నెలనెల ప్రధాని మోదీ దేశాలుపట్టుకుని తిరుగుంటే పక్కలోనే ఉన్న నేపాల్ ఇప్పుడు మనకు దూరంగా జరిగేందుకు రెడీ అవుతోంది. హిందూదేశంగా ఉంటూ ఎప్పటి నుంచో భారత్‌కు స్నేహితుడిగా ఉన్న నేపాల్ ఇప్పుడు ఈ ఆలోచన చేయడం వల్ల మన దేశానికి భవిష్యత్తు చాలా చిక్కులు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు మ్యాటరేంటంటే… ఇప్పటి వరకు హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇటీవలే కొత్త రాజ్యంగం ద్వారా […]
దౌత్యపరంగా అంతర్జాతీయ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తానంటూ నెలనెల ప్రధాని మోదీ దేశాలుపట్టుకుని తిరుగుంటే పక్కలోనే ఉన్న నేపాల్ ఇప్పుడు మనకు దూరంగా జరిగేందుకు రెడీ అవుతోంది. హిందూదేశంగా ఉంటూ ఎప్పటి నుంచో భారత్‌కు స్నేహితుడిగా ఉన్న నేపాల్ ఇప్పుడు ఈ ఆలోచన చేయడం వల్ల మన దేశానికి భవిష్యత్తు చాలా చిక్కులు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు మ్యాటరేంటంటే…
ఇప్పటి వరకు హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇటీవలే కొత్త రాజ్యంగం ద్వారా ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మారింది. అయితే ఈ పరిణామాన్ని అక్కడి హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా భారత్ మూలాలున్న మథేషిలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనచేస్తూ సరిహద్దులను స్తంభింపచేశారు. దీంతో భారత్ నుంచి నేపాల్‌కు సరకు రవాణా ఆగిపోయింది. నేపాల్‌లో పెట్రోల్, డీజీల్,గ్యాస్, ఇతర నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.
నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా మారడం ఇష్టంలేని భారతే ఈ ఆందోళనలకు ఆజ్యం పోస్తోందన్న అనుమానం నేపాల్ ప్రభుత్వానికి ఏర్పడింది. దీంతో భారత్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. సరిహద్దుల్లో సమస్యను పరిష్కరించి దేశంలోని వెంటనే సరకు రవాణా పునరుద్దరించాలని లేని పక్షంలో చైనా సాయం తీసుకుంటామని నేపాల్ ప్రకటించింది. అంతకుమించి తమకు మరోమార్గం లేదని తేల్చేసింది.
కావాలనే సరకు రవాణా ఆపేసిందని ఆరోపిస్తూ నేపాల్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే జనం నేపాల్ భూకంపం సమయంలో భారత్ సాయానికి సలామ్ చేశారు. చైనా సాయం తీసుకుంటామని నేపాల్ ప్రకటించడంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సరకు రవాణాను తాము నిలిపివేయలేదని… అలాంటి దురుద్దేశం కూడా లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దులో జరుగుతున్న ఆందోళనల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఆర్థికంగాను, ప్రాజెక్టుల పూర్తిలో సహకరిస్తూ మన దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలను చైనా మచ్చికచేసుకుంటోంది. ఈ సమయంలో నేపాల్ కూడా దూరమవడం భారత్‌కు మంచి పరిణామం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.