కమలందండులోకి కిరణ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ వీడిన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన కిరణ్ అది కాస్త తుస్సుమనడంతో కొద్దికాలంగా మౌనంగా ఉన్నారు. ఏడాదిన్నరపాటు రిలాక్స్ అయిన కిరణ్ ఇప్పుడు తిరిగి రాజకీయ ప్రస్తానం ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై తర్జనభర్జన పడ్డ కిరణ్ కుమార్ రెడ్డి చివరకు బీజేపీ బెటర్ అన్న నిర్ధారణకు వచ్చారట.ఈ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యుడొకరు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ వీడిన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన కిరణ్ అది కాస్త తుస్సుమనడంతో కొద్దికాలంగా మౌనంగా ఉన్నారు. ఏడాదిన్నరపాటు రిలాక్స్ అయిన కిరణ్ ఇప్పుడు తిరిగి రాజకీయ ప్రస్తానం ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నారు.
ఏ పార్టీలో చేరాలన్న దానిపై తర్జనభర్జన పడ్డ కిరణ్ కుమార్ రెడ్డి చివరకు బీజేపీ బెటర్ అన్న నిర్ధారణకు వచ్చారట.ఈ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యుడొకరు నిర్ధారించినట్టు ఓ తెలుగు దిన పత్రిక చెబుతోంది. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో చేరుతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అందుకు కిరణ్ విముఖత వ్యక్తం చేశారని సమాచారం.
చంద్రబాబుతో తన తండ్రి కాలం నాటి నుంచి రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో టీడీపీలో చేరడం అంటే పదిమెట్లు కిందకు దిగినట్టు అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారని త్వరలోనే పార్టీ మారడం ఖాయమని కుటుంబసభ్యుడు చెప్పినట్టు సదరు పత్రిక కథనాన్ని రాసింది.