పోలీసులను చంపండి: హర్దిక్ పిలుపు!
పటేళ్ల ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. పోరాటమే కాదు.. చేసే వ్యాఖ్యలూ అత్యంత తీవ్రంగా, వివాదాస్పదంగా ఉంటున్నాయి. తాజాగా పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న క్రమంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. అవసరమైతే.. పోలీసులను చంపాలని ఉద్యమనేత హర్దిక్ పటేల్ పిలుపునిచ్చినట్లు వస్తున్న మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకుంటానని విపుల్ దేశాయ్ అనే ఉద్యమకారుడు ఇటీవల ప్రకటన చేశాడు. దాంతో శనివారం అతన్ని హర్దిక్ పటేల్ పరామర్శించాడు. ఈ సందర్భంగానే హర్దిక్ […]
పటేళ్ల ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. పోరాటమే కాదు.. చేసే వ్యాఖ్యలూ అత్యంత తీవ్రంగా, వివాదాస్పదంగా ఉంటున్నాయి. తాజాగా పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న క్రమంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. అవసరమైతే.. పోలీసులను చంపాలని ఉద్యమనేత హర్దిక్ పటేల్ పిలుపునిచ్చినట్లు వస్తున్న మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకుంటానని విపుల్ దేశాయ్ అనే ఉద్యమకారుడు ఇటీవల ప్రకటన చేశాడు. దాంతో శనివారం అతన్ని హర్దిక్ పటేల్ పరామర్శించాడు. ఈ సందర్భంగానే హర్దిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
హర్దిక్ పటేల్ వెళ్లిన తరువాత విపుల్ దేశాయ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పటేళ్ల వారసులుగా ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను చంపాలి గానీ, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని హర్దిక్ తనకు చెప్పారని విపుల్ వివరించారు. విపుల్ చేసిన ఈ వ్యాఖ్యల్ని హర్దిక్ ఖండించాడు. తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశాడు. గుజరాత్‌లో రిజర్వేషన్ల కోసం మరో అగ్రకులస్తుల డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే పటేల్ సామాజికవర్గ ప్రజలు రిజర్వేషన్లకు ఉద్యమిస్తుండగా.. తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆల్ గుజరాత్ బ్రహ్మ సమాజ్ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై పలు తీర్మానాలు చేసినట్లు సమాజ్ అధ్యక్షుడు శైలేశ్ జోషి తెలిపారు. త్వరలోనే ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు.