Telugu Global
Others

బాబోయ్... లోకేష్‌

తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు… ప్రస్తుత టిడిపి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్‌ అంటే టిడిపి నాయకులు భయపడిపోతున్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి లోకేష్‌ ప్రభుత్వ కార్యకలాపాలలో వేలు పెట్టడామే కాకుండా… తమ వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నాడని పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. లోకేష్‌ ప్రవర్తన వల్ల చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని… టిడిపి ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా ప్రజలు భావిస్తున్నారని తెలుగు […]

బాబోయ్... లోకేష్‌
X
naniతెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు… ప్రస్తుత టిడిపి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్‌ అంటే టిడిపి నాయకులు భయపడిపోతున్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి లోకేష్‌ ప్రభుత్వ కార్యకలాపాలలో వేలు పెట్టడామే కాకుండా… తమ వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నాడని పార్టీ సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. లోకేష్‌ ప్రవర్తన వల్ల చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని… టిడిపి ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా ప్రజలు భావిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయ పడుతున్నారు.
రాజ్యాంగేతర శక్తి……లోకెష్!
చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో లక్షిపార్వతి జోక్యం ఎక్కువగా ఉందనే కారణాన్ని చూపించి… ఎన్టీఆర్‌ను పదవి నుంచీ దించేసిన చంద్రబాబు లోకేష్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నా ఎందుకు సమర్ధిస్తున్నాడని పార్టీ నేతలు లోలోపల మదనపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా… తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలన్న చినబాబు అనుమతి అవసరమవుతుందని… నాయకులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.

తమ రాజకీయ అనుభవమంతా వయస్సు లేని లోకేష్ తమపై అధికారం చెలాయించడాన్ని పార్టీ సీనియర్ నాయకులు తప్పు పడుతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి వ్యక్తిగత కార్యదర్శులుగా లోకేష్‌తో సన్నిహితంగా ఉండే వారిని ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నారు… ఆ శాఖకు సంబంధించిన అధికారుల బదిలిలలో మంత్రిగారి మాట కన్నా… చినబాబు మాటే చెల్లుబాటయి ఏకంగా బదిలీలనే రద్దు చేశారు.

రాష్ట్రానికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప హోంశాఖ బాధ్యతలను చూస్తున్నారు. ఆయన పరిస్థితి మరి ఘోరం…. ఎందుకంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కూడా తనకు నచ్చిన పోలీసు అధికారులను కూడా నియమించుకొలేక పోతున్నాడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఇపుడు ఎంపీగా ఉన్న జెసి దివాకర్ రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగినా లోకేష్‌ ఇవ్వలేదంటే ఆయన పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. లోకెష్ ప్రజాప్రయోజనాల కోసం కాకుండా… తన కుటుంబ ప్రయోజనాలు కోసం పని చేస్తున్నాడని తెలుగుదేశం అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఒక నియంతలా వ్వవహారిస్తున్న లోకేష్‌కి చంద్రబాబునాయుడు రోజురోజుకీ ప్రాధాన్యత పెంచడం సీనియర్లకి నచ్చడం లేదు. లోకేష్‌ లాంటి వారితో కలసి పనిచేయడం కంటే వేరే దారి చూసుకోవడం మంచిదనే నిర్ణయానికి కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు వచ్చినట్లు తెలుస్తుంది. చినబాబు తీరుతో విసుగుచెందిన పార్టీ నాయకులు ఏక్షణాన్నైనా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసే అవకాశాలున్నాయి. ఇక్కడే ఒక ట్విస్టు… లోకేష్‌ పేరు చెప్పి బయటకు వెళితే పార్టీకి, తనకు చెడ్డపేరు రావడం ఖాయంగా భావిస్తున్న అధినేత చంద్రబాబు సీనియర్లకు పొమ్మనకుండా పొగ బెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది.
– సవరం నాని
First Published:  4 Oct 2015 10:59 AM GMT
Next Story