భారత్ చర్చలకు రావాల్సిందే: నవాజ్ షరీఫ్
ఒకవైపు చైనా, పాకిస్థాన్ జోడి కడుతున్న నేపథ్యంలో పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు సరిహద్దులో చైనా, మరోవైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైనికులను రెచ్చగొడుతున్న వేళ ఇలాంటి మాటలు ఉద్రిక్తతకు మరింత తావిస్తున్నాయి. భారత్ తమ వద్దకు చర్చలకు వచ్చి తీరాల్సిందేనని నవాజ్ షరీఫ్ ఇంత ఘాటుగా చెప్పడం వెనుక ఆయనకు దన్నుగా ఉన్న చైనా కనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి వాస్తవిక, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనలతో భారత్ తమతో చర్చలకు […]
ఒకవైపు చైనా, పాకిస్థాన్ జోడి కడుతున్న నేపథ్యంలో పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు సరిహద్దులో చైనా, మరోవైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైనికులను రెచ్చగొడుతున్న వేళ ఇలాంటి మాటలు ఉద్రిక్తతకు మరింత తావిస్తున్నాయి. భారత్ తమ వద్దకు చర్చలకు వచ్చి తీరాల్సిందేనని నవాజ్ షరీఫ్ ఇంత ఘాటుగా చెప్పడం వెనుక ఆయనకు దన్నుగా ఉన్న చైనా కనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి వాస్తవిక, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనలతో భారత్ తమతో చర్చలకు వచ్చి తీరాల్సిందేనని ప్రధాని నవాజ్ షరీప్ గట్టిగానే అన్నారు. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద దాడులలో భారత్ పాత్ర ఉందని, ఇందుకు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని అన్నారు. ఇటువంటి పరోక్ష యుద్ధం వల్ల ఇరుదేశాలకూ ప్రయోజనం ఉండదని, 70 ఏళ్లుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోయేలా మంచి సూచనలతో భారత్ చర్చలకు రావాల్సిందేనని అన్నారు.
పీఓకే ఉగ్రవాదులపై దాడులకు రెడీ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేయగల సత్తా మన రక్షణ దళాలకు ఉందని భారత వాయుసేన చీఫ్ మార్షల్ అరూప్ రాహా తెలిపారు. రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే తాము ముందడుగు వేస్తామని అన్నారు. టిబెట్‌లో చైనా తన సేనలను బలోపేతం చేస్తోందని, దీనిపై భయపడాల్సిందేమీ లేదని, భారత బలగాలు కూడా పటిష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో వాటిని మెహరిస్తూ… కీలక ప్రాంతమైన కార్గిల్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని రాహా తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, నియంత్రణ రేఖ వెంబడి మయన్మార్ తరహా ఆపరేషన్ చేపట్టగలమని ధీమా వ్యక్తం చేశారు.
పాక్ నిర్బంధంలో 65 మంది భారత జాలర్లు
గుజరాత్ తీరం నుంచి సముద్రంలోకి ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లిన పోరుబందర్‌కు చెందిన 65 మంది జాలర్లను పాకిస్థాన్ సిబ్బంది నిర్బంధించారు. వీరికి చెందిన 12 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారని జాతీయ మత్స్యకారుల ఫోరం కార్యదర్శి మనీశ్ లొధారీ తెలిపారు. పాకిస్థానీ భద్రతా సిబ్బంది ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ జాలర్లను నిర్బంధించడం ఇది మొదటిసారి.