విజయమే లక్ష్యంగా బీజేపీ 'మిషన్ బీహార్'!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశకు మరో వారం రోజుల్లో తెర లేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు కదులుతోంది. ముందుగా రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టింది. దీన్ని చక్కబెట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బీహార్‌లోనే మకాం వేశారు. గెలుపు సాధించాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని పార్టీ తీర్మానించింది. ఇందులో భాగంగా అమిత్ షా ‘మిషన్ బీహార్’ను ప్రారంభించారు. బీహార్ మొదటిదశలో 583 […]
బీహార్‌లో 37 జిల్లాలుండగా ప్రతి జోన్‌లో 3 జిల్లాలు ఉండేలా చూశారు. ప్రతీ జోన్‌కు ‘రాజనీతిక్ ప్రహారీ’ పేరుతో ఒక ఇంఛార్జ్‌ని నియమించారు. కేంద్ర మంత్రులైన రవిశంకర్ ప్రసాద్, గిరి రాజ్‌సింగ్, రాజీవ్ ప్రతాప్ రూఢి లాంటి వారిని రాజనీతిక్ ప్రహారీలుగా నియమించినట్లు సమాచారం. వీరికి అరెస్సెస్ నుంచి వచ్చిన ఒక నాయకుడు సహాయకుడిగా ఉంటారు. ఆరెస్సెస్ పర్వవేక్షణలో ఈ ఎన్నికల్లో గెలవటం సాధ్యమని బీజేపీ భావిస్తోంది. క్రిందిస్థాయిలో సంఘ్‌కు పట్టున్న ప్రాంతాల్లో ఆరెస్స్‌స్ కార్యకర్తల సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రత్యర్థి మహాకూటమి పార్టీలు సైతం గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమిత్ షా మిషన్ బీహార్ ప్రారంభించడం విపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూ… ఆయన అనేక రంగాల్లో వైఫల్యం చెందారంటూ విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆరెస్సెస్ క్యాడర్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మాటకారి తనం ఎక్కువగా ఉండే ఈ క్యాడర్ విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు. గడిచిన కాలంలో రాష్ట్రంలో సీఎం నితీష్ చేసిన పనుల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.