అమరావతి నుంచి కూడా తరిమేస్తారేమో!
ఏపీలో అప్పుడే ప్రాంతీయ విభేదాలు బయలుదేరుతున్నాయి. సీమ నేతలు వీలుదొరికినప్పుడల్లా విభజనరాగం ఆలపిస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక హక్కులు కల్పిస్తేనే ఆంధ్ర ప్రాంతంతో తాము కలిసుంటామని లేనిపక్షంలో ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామని టీడీపీ నేత టీజీ వెంకటేశ్ అన్నారు. టీజీ ప్రస్తుతం రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల వేదిక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రాయలసీమవాసులను హైదరాబాద్ నుంచి తరిమేశారని.. భవిష్యత్తులో అమరావతి నుంచి కూడా తరిమేసే ప్రమాదం ఉందన్నారు. అమరావతిని ఫ్రీజోన్ చేసి అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు […]
ఏపీలో అప్పుడే ప్రాంతీయ విభేదాలు బయలుదేరుతున్నాయి. సీమ నేతలు వీలుదొరికినప్పుడల్లా విభజనరాగం ఆలపిస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక హక్కులు కల్పిస్తేనే ఆంధ్ర ప్రాంతంతో తాము కలిసుంటామని లేనిపక్షంలో ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామని టీడీపీ నేత టీజీ వెంకటేశ్ అన్నారు. టీజీ ప్రస్తుతం రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల వేదిక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రాయలసీమవాసులను హైదరాబాద్ నుంచి తరిమేశారని.. భవిష్యత్తులో అమరావతి నుంచి కూడా తరిమేసే ప్రమాదం ఉందన్నారు.
అమరావతిని ఫ్రీజోన్ చేసి అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. టీజీనే కాదు కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రె్డ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నదైందని డీఎల్ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉంటూనే టీజీ విభజనరాగం ఆలపించడం అధికారపార్టీకి చికాకు కలిగించే అంశమే.