శృతిహాసన్ ఎకనామిక్స్..!
దీపం వున్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి. ఈ నానుడిని ఎక్కువుగా హీరోయిన్స్ రెమ్యున్ రేషన్ విషయంలో ఉపయోగిస్తుంటారు. ఒక సినిమా విజయం సాధించిందంటే.. స్టార్ హీరోయిన్స్ రెమ్యున్ రేషన్ ను పెంచే ఆలోచన చేస్తుంటారు. ఆఫర్స్ వరసగా వస్తే..ఏ ప్రొడ్యూసర్ ఎక్కు వ రెమ్యున్ రేషన్ ఆఫర్ చేస్తే ఆ చిత్రంలో నటించడానికి వెనకంజ వేయరు. ఇక ప్రస్తుతం శృతిహాసన్ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్లు వరస హిట్స్ పడుతున్నాయి . […]
దీపం వున్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి. ఈ నానుడిని ఎక్కువుగా హీరోయిన్స్ రెమ్యున్ రేషన్ విషయంలో ఉపయోగిస్తుంటారు. ఒక సినిమా విజయం సాధించిందంటే.. స్టార్ హీరోయిన్స్ రెమ్యున్ రేషన్ ను పెంచే ఆలోచన చేస్తుంటారు. ఆఫర్స్ వరసగా వస్తే..ఏ ప్రొడ్యూసర్ ఎక్కు వ రెమ్యున్ రేషన్ ఆఫర్ చేస్తే ఆ చిత్రంలో నటించడానికి వెనకంజ వేయరు. ఇక ప్రస్తుతం శృతిహాసన్ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్లు వరస హిట్స్ పడుతున్నాయి . దీంతో తెలుగులో ఒక్కో సినిమాకు దాదాపు కోటిన్నర తీసుకుంటుందని టాక్.
అయితే బాలీవుడ్ లో తనకు అంత గా డిమాండ్ లేదు కాబట్టి.. బ్యానర్.. కాస్తా హీరో కొంత పేరు వున్న వాళ్లు అయితే.. 50 లక్షల లోపే సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చేస్తుందని తెలుస్తుంది. ఇక తన కోలీవుడ్ లో కాస్తా బ్యాలెన్స్ గా వెళ్తుందని టాక్. కలీవుడ్ లో తనకు ఇంకా బ్లాక్ బస్టర్స్ పడలేదు కాబట్టి.. దానికి తగ్గట్లు వెళ్తుందన్నమాట. ఇలా తనకు డిమాండ్ బాగా వున్నోచోట ఒక రేటు.. మీడియం డిమాండ్ వున్న చోట మరో రేంజ్ లో రెమ్యున్ రేషన్.. తను ఎస్టాబ్లీష్ కావాలని ఆలోచిస్తున్న చోట ఆఫర్ వస్తే మరో రేంజ్ రెమ్యున్ రేషన్ కోట్ చేస్తుందట. మొత్తం మీద డిమాండ్ ను బట్టి ధరను పెంచడం అనే ఎకనామిక్స్ ను బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. అంతేలే గబ్బర్ సింగ్ ముందు వరకు ఐరన్ లెగ్ అని స్టాంప్ వేశారు మరి. అప్పుడు విమర్శలు భరించింది. ఇప్పుడు సక్సెస్ ను ఆస్వాదిస్తుంది కదా..!