అమ్మా చినబాబు..! అందుకా నిమ్మకూరు దత్తతు!
శ్రీమంతుడు సినిమా చూసి తర్వాత చాలా మంది గ్రామాలను దత్తతు తీసుకుంటున్నట్టుగానే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ఇటీవల ఆ లిస్ట్‌లో చేరిపోయారు. తండ్రిగారి ఊరు నారావారిపల్లెను పక్కన పెట్టి కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును దత్తతు తీసుకున్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. వెనుక బడిన రాయలసీమలోని స్వగ్రామాన్ని వదిలి పెట్టి కృష్ణాజిల్లా గ్రామంపై చినబాబు ఎందుకు ఫోకస్ పెట్టారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే చినబాబు ఎత్తు వెనుక […]
శ్రీమంతుడు సినిమా చూసి తర్వాత చాలా మంది గ్రామాలను దత్తతు తీసుకుంటున్నట్టుగానే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ఇటీవల ఆ లిస్ట్‌లో చేరిపోయారు. తండ్రిగారి ఊరు నారావారిపల్లెను పక్కన పెట్టి కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును దత్తతు తీసుకున్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. వెనుక బడిన రాయలసీమలోని స్వగ్రామాన్ని వదిలి పెట్టి కృష్ణాజిల్లా గ్రామంపై చినబాబు ఎందుకు ఫోకస్ పెట్టారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే చినబాబు ఎత్తు వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరు గుడివాడ నియోజవర్గం పరిధిలో ఉంది. కానీ ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచారు. తాత గారి సొంత నియోజకవర్గం పక్కపార్టీ పాలైందన్న కసితోనే తిరిగి ఇక్కడ పట్టుసాధించేందుకు లోకేష్ రంగంలోకి దిగారని అందులో భాగంగానే నిమ్మకూరును దత్తతు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనలో పస లేదు. ఎందుకంటే…
తాతగారి ఊరున్న నియోజకవర్గమే కాదు… తండ్రి చంద్రబాబు సొంతూరు ఉన్న నియోజకవర్గం కూడా వైసీపీ చేతిలోనే ఉంది. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె .. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉంది. అక్కడ కూడా టీడీపీ ఓడిపోయింది. వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట ఓ కొడుకుగా తండ్రి నియోజకవర్గాన్ని నిలబెట్టాలే గానీ… తాతగారి ఊరిని నిలబెడుతానంటూ కథలు చెబితే ఎలా నమ్మాలని నేతలు ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధిపరంగా చూసినా నిమ్మకూరు బాగానే అభివృద్ధి చెందింది. ఎందుకంటే తొలి నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆ గ్రామంపై ఇంతోఅంతో శ్రద్ధ చూపుతూనే ఉంది. నిమ్మకూరుతో పోలిస్తే నారావారిపల్లె అభివృద్ధిలో వెనుకబడి ఉంది.
లోకేష్ నిమ్మకూరును దత్తతు తీసుకోవడం వెనుక అసలు వ్యూహం ఏమిటంటే !. టీడీపీకి నాయకత్వం వహించాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోకి ఓ బలమైన సామాజికవర్గం మద్దతు, ఆమోదముద్ర తప్పనిసరి అన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు తర్వాత త్వరలోనే టీడీపీకి అధినాయకుడవ్వాలని ఉవ్విళ్లూరుతున్న లోకేష్ అందుకు రెండు జిల్లాల్లోని ఆ సామాజికవర్గాన్ని దువ్వే పనిలో పడ్డారట . అందుకే కృష్ణాజిల్లాపై లోకేష్ ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారని చెప్పుకుంటున్నారు.
నిమ్మకూరు గ్రామాన్ని దత్తతు తీసుకుని తనపై కృష్ణాజిల్లా బ్రాండ్ వేయించుకునేందుకు చినబాబు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దీనితో పాటు నిమ్మకూరు దత్తతు ద్వారా సీనియర్ ఎన్టీఆర్‌కు అసలైన మనవడిని తానేనని ప్రమోట్ చేసుకునే ఆలోచన కూడా చేస్తున్నట్టు భావిస్తున్నారు.