హార్దిక్ పటేల్ నిర్ణయం " నితీష్ హ్యాపీ
గుజరాత్ లో పటేల్ వర్గానికి రిజర్వేషన్ లు కావాలంటూ అక్కడి ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న హార్దిక్ పటేల్ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. బీహార్ లో జరుగుతున్న ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల హార్దిక్ పటేల్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు మద్దతు ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే అక్కడ కూడా ర్యాలీలు చేపడతామని తెలిపాడు. ఇప్పటికే బీహార్ లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి సభ్యులు […]
BY sarvi3 Oct 2015 7:51 AM IST
X
sarvi Updated On: 3 Oct 2015 8:02 AM IST
గుజరాత్ లో పటేల్ వర్గానికి రిజర్వేషన్ లు కావాలంటూ అక్కడి ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న హార్దిక్ పటేల్ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. బీహార్ లో జరుగుతున్న ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల హార్దిక్ పటేల్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు మద్దతు ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే అక్కడ కూడా ర్యాలీలు చేపడతామని తెలిపాడు. ఇప్పటికే బీహార్ లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి సభ్యులు ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.
అక్టోబర్ నెలాఖరులో నలంద యూనివర్సిటీ వద్ద ర్యాలీలు నిర్వహించేందుకు హార్దిక్ పటేల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న నితీశ్ సామాజిక వర్గానికి చెందిన కుర్మీలను ఉద్యమంలో భాగస్వామ్యులను చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. పటేల్, కుర్మీ, గుజ్జర్, మరాఠాలను ఏకతాటిపైకి తెచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హర్దిక్ పటేల్ తెలిపారు.
నితీశ్ కు మద్ధతు ప్రకటించటం ద్వారా పటేల్ వర్గాన్ని బీహార్ లో నితీశ్ ఓటు బ్యాంకుగా మార్చాలని హార్దిక్ పటేల్ భావిస్తున్నారు. ఇదే సమయంలో నితీష్ కూడా తనకు మద్దతుగా హార్దిక్ ను ఎన్నికల ప్రచారంలో దించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేయాలి.. లేదా ఆర్ధికంగా వెనకబడిన వారికి మాత్రమే ఇవ్వాలన్న సిద్దాంతానికి తాము విరుద్ధమని పటిదార్ అనామత్ ఆందోళన సమితి అంటోంది. కేవలం పటేళ్లకు జరుగుతున్న అన్యాయంపైనే బీహార్ లో తాము పోరాడతామన్నారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వెనుకబడిందన్న ప్రచారం నేపథ్యంలో హార్దిక్ పటేల్ నితీష్ కు మద్దతు పలకడం మరింత ఇబ్బందికరంగా మారడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి పటేళ్ల ఉద్యమానికి బీహార్ లో బలం ఉందా… లేదా అన్నది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది. .
Next Story