కాంగ్రెస్ కార్యకర్తల శాడిజం, పావురాలకు తారాజువ్వలు
పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల కొందరు తమ శాడిజాన్ని శాంతికపోతాలపై చూపించారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమక్షంలోనే దారుణానికి ఒడిగట్టారు. శాంతికి చిహ్నంగా ఎగరేయాల్సిన పావురాలకు తారాజువ్వలు కట్టి వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన రైతు గర్జన సభకు హాజరైన రఘువీరాకు వినూత్న రీతిలో స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో పావురాలను బలిచేశారు. పావురాలకు భారీ తారాజువ్వలు కట్టి ఆకాశంలోకి వదిలారు. ఆకాశంలోకి వెళ్లాక తారా జువ్వలు పేలడంతో రెండు పావురాలు ప్రాణాలు కోల్పొయి నేలరాలాయి. రఘువీరారెడ్డి, […]
పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల కొందరు తమ శాడిజాన్ని శాంతికపోతాలపై చూపించారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సమక్షంలోనే దారుణానికి ఒడిగట్టారు.
శాంతికి చిహ్నంగా ఎగరేయాల్సిన పావురాలకు తారాజువ్వలు కట్టి వదిలారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన రైతు గర్జన సభకు హాజరైన రఘువీరాకు వినూత్న రీతిలో స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో పావురాలను బలిచేశారు. పావురాలకు భారీ తారాజువ్వలు కట్టి ఆకాశంలోకి వదిలారు. ఆకాశంలోకి వెళ్లాక తారా జువ్వలు పేలడంతో రెండు పావురాలు ప్రాణాలు కోల్పొయి నేలరాలాయి.
రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు సమక్షంలోనే ఈ విన్యాసం చేశారు. . కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై జంతు ప్రేమికులతో పాటు ఈ చర్యను చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇంత దారుణమైన ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. అయితే తారజువ్వల్లో పావురాలను ఉంచిన విషయం రఘువీరారెడ్డికి తెలియదని సమాచారం.