వావ్.. పర్లేదు పాసైపోయా
మెగాస్టార్ చిరు తన 150వ సినిమాపై మరింత క్లారిటీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో 150 సినిమా రావడం ఖాయమని స్పష్టం చేశారు. హైటెక్స్‌లో జరిగిన బ్రూస్‌లీ ఆడియో పంక్షన్‌కు హాజరైన చిరు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. 150వ సినిమాకు చరణ్‌తో పాటు తన భార్య సురేఖ కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పారు. మరో 10- 15 రోజుల్లో లేదా బ్రూస్‌లీ రిలీజ్‌కు ముందే తన 150వ సినిమా విశేషాలను నిర్మాతలు చరణ్, సురేఖలే నేరుగా […]
మెగాస్టార్ చిరు తన 150వ సినిమాపై మరింత క్లారిటీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో 150 సినిమా రావడం ఖాయమని స్పష్టం చేశారు. హైటెక్స్‌లో జరిగిన బ్రూస్‌లీ ఆడియో పంక్షన్‌కు హాజరైన చిరు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
150వ సినిమాకు చరణ్‌తో పాటు తన భార్య సురేఖ కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పారు. మరో 10- 15 రోజుల్లో లేదా బ్రూస్‌లీ రిలీజ్‌కు ముందే తన 150వ సినిమా విశేషాలను నిర్మాతలు చరణ్, సురేఖలే నేరుగా వెల్లడిస్తారన్నారు. బ్రూస్‌లీ పేరుతో సినిమా చేయడం ద్వారా చరణ్ జీవితం ధన్యమైందన్నారు మెగాస్టార్. సినిమాలో తన ఎంట్రీ ఫుల్ మీల్స్ తర్వాత ఐస్‌క్రీమ్‌లా ఉంటుందన్నారు.
సినిమాలో అభిమానులనుద్దేశించి ఉన్న ఒక డైలాగ్‌ను చిరు బయటపెట్టారు. ”మీ స్టామినాను, స్పీడ్‌ను అందుకోవడం ఎవరి వల్ల కాదు బాస్ అన్న చరణ్ డైలాగ్‌కు .. తన స్టామినాకు, స్పీడ్‌కు ఫ్యూయల్ అభిమానులేనని చిరు బదులిస్తారట. ”అభిమానులు పిలుస్తున్నారు వెళ్తున్నా” అన్న డైలాగ్ కూడా ఉంటుందని చిరంజీవి చెప్పారు.
ఎనిమిదేళ్ల తర్వాత స్కీన్ మీద ఎలా కనిపిస్తానోనని తాను కూడా ఉత్కంఠకు గురయ్యానని చిరు చెప్పారు. బ్రూస్‌లీ షూటింగ్‌లో మానిటర్ మీద తన నటన చూసుకున్న తర్వాత ”వావ్… నేను పాస్ అయిపోయా పర్లేదు” అని అనిపించదన్నారు.