హైదరాబాద్‌లో ఆగని గొలుసు దొంగతనాలు
హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగలను పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు. పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తిస్తున్నారు. శుక్రవారం నేరెడ్‌మెట్, మీర్‌పేటలో గొలుసు దొంగతనాలు చోటుచేసుకోగా శనివారం ఇంకా తెల్లారకుండానే వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్ జరిగింది. దీంతోపాటు మరో మూడుచోట్ల దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఎల్బీనగర్‌లో ఓ వృద్ధురాలి మెడ నుంచి 3 తులాల గొలుసు చోరీకి గురైంది. ఈ సంఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో […]
హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగలను పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు. పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తిస్తున్నారు. శుక్రవారం నేరెడ్‌మెట్, మీర్‌పేటలో గొలుసు దొంగతనాలు చోటుచేసుకోగా శనివారం ఇంకా తెల్లారకుండానే వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్ జరిగింది. దీంతోపాటు మరో మూడుచోట్ల దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఎల్బీనగర్‌లో ఓ వృద్ధురాలి మెడ నుంచి 3 తులాల గొలుసు చోరీకి గురైంది. ఈ సంఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో మహిళ మెడ నుంచి మూడు తులాల గొలుసు, మల్కాజ్‌గిరి ఎస్‌బీఐ కాలనీలో మరో మహిళ మెడ నుంచి మూడు తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల నిఘా ఉన్నా, సుశిక్షితులైన మొబైల్ పోలీసింగ్ పహారా ఉన్నా… చైన్ స్నాచర్ల ఆగడాలను అరికట్ట లేకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.