తారల ఇళ్లల్లో 100 కోట్ల ఆస్తులు?
పులి సినిమాకు చేసుకున్న ప్రచారం ఆ సినిమాలో నటించిన వారితోపాటు ఇతర తారలకూ తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. సినిమాలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారంటూ వార్తలు రావడంతో ఐటీ శాఖ తమిళనటులపై దృష్టి సారించింది. సరిగ్గా సినిమా రెండురోజుల ముందు నటులు విజయ్, నయనతార, సమంత, నిర్మాతలు సెల్వకుమార్, సిబు తామిన్స్, కలైపులి థాను తదితరుల ఇళ్లపై చెన్నై, హైదరాబాద్, […]
పులి సినిమాకు చేసుకున్న ప్రచారం ఆ సినిమాలో నటించిన వారితోపాటు ఇతర తారలకూ తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. సినిమాలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారంటూ వార్తలు రావడంతో ఐటీ శాఖ తమిళనటులపై దృష్టి సారించింది. సరిగ్గా సినిమా రెండురోజుల ముందు నటులు విజయ్, నయనతార, సమంత, నిర్మాతలు సెల్వకుమార్, సిబు తామిన్స్, కలైపులి థాను తదితరుల ఇళ్లపై చెన్నై, హైదరాబాద్, మదురై, కొచ్చిన్, కొయంబత్తూర్‌లలో ఏకకాలంలో దాడులు చేసి భారీగా లెక్కలో లేని ఆస్తులను గుర్తించింది. ఒక్క నటుడు విజయ్ ఇంట్లోనే రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక ఇతర నటుల ఇళ్లలో లభించిన నగలు, నగదు, దస్తావేజుల విలువ మొత్తం దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో వీటన్నింటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. సినీతారల ఇళ్లపై ఐటీ దాడులు కొత్తేం కాదు.. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు.